Thursday, November 7, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 15
15.
శరీరవాఙ్మనోభిర్యత్‌
కర్మ ప్రారభతే నర: |
న్యాయ్యం వా విపరీతం వా |
పంచైతే తస్య హేతన: ||

తాత్పర్యము : దేహముచే గాని, మనస్సుచే గాని, వాక్కుచే గాని మనుజుడు ఒనరించు న్యాయాన్యాయ కర్మలన్నింటికిని ఈ ఐదు అంశములే కారణములు.

భాష్యము : ”న్యాయం” మరియు ”విపరీతం” అనెడి పదములు ఈ శ్లోకమున అతి ప్రధానమైనవి. శాస్త్ర నిర్దేశములను అనుసరించి చేయు కర్మలు న్యాయకర్మలుగా తెలియబడగా, శాస్త్ర నియమములకు విరుద్ధంగా చేయు కర్మలు విపరీత కర్మలుగా తెలియబడుచున్నవి. కాని ఏది చేసినను దాని పూర్ణ నిర్వాహణ కొరకు ఈ ఐదు అంశమలు అత్యంత అవసరములై ఉన్నవి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement