Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 24
24
య ఏవం వేత్తి పురుషం
ప్రకృతిం చ గుణౖస్సహ |
సర్వథా వర్తమానోపి
న స భూయోభిజాయతే ||

అర్థము : భౌతిక ప్రకృతి, జీవుడు, త్రిగుణముల అంత:ప్రక్రియకు సంబంధించిన ఈ తత్త్వమును అవగాహన చేసికొనినవాడు నిశ్చయముగా మోక్షమును పొందును. అతని వర్తమాన స్థితి ఎట్లున్నను అతడు తిరిగి జన్మింపడు.

భాష్యము : ఇంతవరకూ వివరించిన జ్ఞానము యొక్క లక్ష్యమేమనగా జీవుడు తన పొరపాటు వలన ఈ భౌతిక సంసారములో పడిపోయి తిరిగి గురువు, సాధువు ప్రామాణికుల సాంగత్యములో వారి కృప కొరకు కృషి చేసి భగవద్గీతను అర్థము చేసుకుని తన నిజస్థితిని తెలుసుకున్నట్లయితే ఈ భౌతిక సంసారమునకు తిరిగి రావలసి ఉండదు. ఆధ్యాత్మిక ప్రపంచమునకు తరలించబడి, జ్ఞానము మరియు ఆనందములతో కూడుకుని ఉన్న శాశ్వత జీవితమును అనుభవించ గలుగుతాడు. ఇదే జ్ఞానము యొక్క నిజమైన సాఫల్యత.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement