Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 26-27
26.
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రా:
సర్వే సహైవావనిపాలసంఘై: |
భీ ష్మో ద్రోణ: సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యై: ||

27.
వక్త్రాణి తే త్వరమాణా విశంతి
దంష్ట్రాకరాళాని భయానకాని |
కేచిద్విలగ్నా దశనాంతరేషు
సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై: ||

26–27 తాత్పర్యము : తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్రతనయులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్షపు యోధముఖ్యులు కూడా వేగముగా నీ భయంకరమైన నోళ్ళ యందు ప్రవేశించుచున్నారు. వారిలో కొందరు నీ దంతముల నడుమ చూర్ణిత శిరులై తగుల్కొనుటయు నేను గాంచుచున్నాను.

భాష్యము : ఇంతకు ముందు శ్లోకాలలో శ్రీకృష్ణుడు అర్జునునికి నీకు ఆసక్తికరమైనవి ఏవి చూడాలన్నా విశ్వరూపము నందు చూడగలవని వాగ్దానము చేశాడు. కాబట్టి అర్జునుడు ప్రత్యర్థి నాయకులైన భీష్మ, ద్రోణ, కర్ణ మరియు దృతరాష్ట్రుని వందమంది కుమారులు, వారి సైన్యము అంతేకాక తన సైన్యము కూడా అంతము కావటాన్ని చూసెను. కాబట్టి కురుక్షేత్రమందు అందరూ సంహరింపబడి యుద్ధానంతరము అర్జునుడు విజయుడవుతాడని సూచన ఇవ్వబడినది. ఓటమి ఎరుగని భీష్ముడు, కర్ణుడు అలాగే అర్జునుని తరుపున ఉన్న గొప్ప నాయకులూ నశిచబోవుచున్నారని కృష్ణుడు తీర్మానించెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement