Tuesday, April 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 13
13.
తత్రైకస్థం జగ్‌ కృత్స్నం
ప్రవిభక్తమనేకధా |
అపశ్యద్దేవదేవస్య
శరీరే పాండవస్తదా ||

తాత్పర్యము : ఆ సమయమున అర్జునుడు బహువేలసంఖ్యలో విభజింపబడియున్నను ఒకే చోట నిలిచియున్న విశ్వము యొక్క అనంత రూపములను శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమున గాంచెను.

భాష్యము : ఇక్కడ ”తత్ర” అను పదము అనగా ”అక్కడ” అనేది ముఖ్యమైనది. అర్జునుడు, కృష్ణుడు రధముపైననే ఉండి వీటన్నింటినీ చూచెనని అర్థమగుచున్నది. అర్జునుడు కృష్ణుని యందు వేలకొలది గ్రహాలను చూచెను. శాస్త్రాలలో మనకు భూమిచేత, బంగారము చేత, వజ్రాల చేత చేయబడిన గ్రహాలు లేదా లోకాలు కూడా ఉన్నాయని తెలియజేయడమైనది. అలాగే కొన్ని అతి పెద్దవైతే, మరొకొన్ని అతి చిన్నవి. ఇలా అనేక రకాల గ్రహాలను అర్జునుడు రథముపైననే ఉండి చూడ గలిగెను. అయితే యుద్ధరంగములో మిగిలినవారికి దివ్యదృష్టి ఇవ్వకపోవుటచే, వారు కృష్ణునికి అర్జునునికి మధ్య ఏమి జరుగుచున్నదో అర్థము చేసుకోలేకపోయారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement