Friday, April 19, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 10 మరియు 11
10.
అనేకవక్త్రనయనమ్‌
అనేకాద్భుతదర్శనమ్‌ |
అనేకదివ్యాభరణం
దివ్యానేకోద్యతాయుధమ్‌ ||

11.
దివ్యమాల్యాంబరధరం
దివ్యగంధానులేపనమ్‌ |
సర్వాశ్చర్యమయం దేవమ్‌
అనంతం విశ్వతోముఖమ్‌ ||

10-11 తాత్పర్యము : అర్జునుడు ఆ విశ్వరూపమును అనంతసంఖ్యలో ముఖములను, నేత్రములను, అద్భుత దృశ్యములను గాంచెను. ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకృతమై, ఎత్తబడియున్న పలు దివ్యాయుధములను కలిగియుండెను. అతడు దివ్య పూమాలలలను మరియు వస్త్రములను దాల్చియుండెను. పలు దివ్యసుగంధములు అతని దేహమునకు అలదబడియుండెను. అంతయు ఆశ్చర్యమయముగను, ప్రకాశమాసముగను, అనంతముగను, సర్వవ్యాపకముగను ఉండెను.

భాష్యము : ఈ రెండు శ్లోకాలలో ”అనేక” అనే పదము లెక్కలేనన్ని చేతులు, కాళ్ళు, కళ్ళు ఇంకా ఇతరములు అర్జునునికి కనిపించుచున్నవని తెలియజేస్తుంది. ఇవన్నీ విశ్వమంతటా వ్యాపించి ఉన్నవి. కృష్ణుని కృప వలన అర్జునుడు వాటన్నింటినీ చూడగలుగుచున్నాడు. కృష్ణుని ప్రత్యేక మహిమ వలననే వీటన్నింటినీ గాంచుట సాధ్యమగుచున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement