Wednesday, April 24, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 15
15.
స్వయమేవాత్మనాత్మానం
వేత్థ త్వం పురుషోత్తమ |
భూతభావన భూతేశ
దేవదేవ జగత్పతే ||

తాత్పర్యము : ఓ పురుషోత్తమా! సర్వకారణుడా! సర్వేశ్వరుడా! దేవదేవా! జగన్నాథా! నీవొక్కడివ నీ అంతరంగశక్తి ద్వారా నిజముగా నిన్నెరుగుదువు.

భాష్యము : అర్జునుని వలే మనము కూడా భక్తి ద్వారా కృష్ణునితో సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు మాత్రమే కృష్ణున్ని అర్థము చేసుకొనగలుగుతాము. భగవద్గీత అనేది కృష్ణుని సందేశము, కృష్ణుని తత్త్వము. దానిని అర్జునుని వలే మాత్రమే అర్థము చేసుకొనగలము. పరమ సత్యమైన శ్రీకృష్ణున్ని మూడు రకాలుగా అనగా నిరాకార బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడుగా అర్థము చేసుకుంటూ ఉంటారు. కేవలము నిరాకార బ్రహ్మమని భగవద్గీత ద్వారా అర్థము చేసుకున్నవారు తప్పు కాదు కాని అసంపూర్ణముగా, అనగా కృష్ణుని వ్యక్తిత్వాన్ని గుర్తించలేకపోయినట్లు. అందుకే ఇక్కడ అర్జునుడు కృష్ణుని గురించిన పూర్తి సత్యాన్ని తెలియజేయుచున్నాడు. శ్రీకృష్ణుడు పురుషోత్తముడు, అందరి జీవరాశులకు తండ్రి వంటివాడు, వారిని నియంత్రించువాడు, దేవదేవుడు మరియు జగత్పతి. కాబట్టి శ్రీకృష్ణున్ని సరిగా అర్థము చేసుకొనవలెనన్న అర్జునుని అడుగు జాడలలో నడవటమే ఉత్తమము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement