Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 04

4
అర్జున ఉవాచ
అపరం భవతో జన్మ
పరం జన్మ వివస్వత: |
కథమేతద్విజానీయాం
త్వమాదౌ ప్రోక్తవానితి

తాత్పర్యము : అర్జునుడు పలికెను : సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకన్నను ముందు పుట్టినవాడు. అట్లయినచో నీవీ జ్ఞానమును అతనికి ఉపదేశించితివి అనుటను నేనెట్లు అర్ధము చేసికొనగలను?

భాష్యము : అర్జునుడు, శ్రీకృష్ణుని భక్తుడు కనుక దేవాదిదేవుని దివ్య స్థితి గురించి ఆయనకు ఎటువంటి అనుమానమూ లేదు. అయితే శ్రీకృష్ణుడు సామాన్యమైన వ్యక్తి అని భావించే నాస్తికులకు ఆయన గొప్పతనము విచిత్రముగా తోచవచ్చును. అందుచే అర్జునుడు వారికోసము శ్రీకృష్ణుని ముందు ఈ ప్రశ్నను ఉంచెను. తద్వారా భగవంతుని నుండే సమాధానము వినిన వక్ర భాస్యమునకు ఆస్కారము ఉండదు. అనాది కాలముగా శ్రీకృష్ణుడిని అందరూ ప్రామాణికునిగా స్వీకరింతురు గనుక ఆయన మాటలు వినుట ద్వారా అందరికీ విశ్వాసము కలుగ వచ్చునని భావించి అర్జునుడు ఈ ప్రశ్నను వేసెను. శ్రీ కృష్ణుడి నుండి వినుట అందరికీ శుభ ప్రదమైనది. కాబట్టి అందరూ తమ క్షేమము కొరకు ఈ భగవద్గీతా విజ్ఞానాన్ని వినవలసి ఉన్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement