Wednesday, April 17, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు – దానము(11) (ఆడియోతో…)

మార్కండేయ పురాణంలోని శ్లోకానికి స్కాంద పురాణంలో తెలిపిన వృత్తాంతం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

కుటుంబం పీడ యిత్వాతు బ్రాహ్మణాయ మహాత్మనే
దాతవ్యం భిక్షవేప్యన్నమ్‌ ఆత్మనోభూతి మిచ్ఛతా

తన అభివృద్ధి ని కోరుకున్నవాడు కుటుంబానికి పెట్టవలసిన దానిలో కొద్ది భాగం తగ్గించి వారికి బాధ కలిగినా ఆక లితో అల్లాడుచూ భిక్షాటనకు వచ్చిన మహానుభావుడయిన బ్రాహ్మణునకు కొంత అన్నమును దానం చేయవలయును. ఇచట ‘బ్రాహ్మణాయ’ అని ఉన్ననూ ఆకలిగొని భిక్షాటనకు వచ్చిన వారు ఎవరైనా వారి ఆకలి తీర్చుటకు తాను, తన కుటుంబం తినే దానిలో రెండు ముద్దలు ఆ భిక్షకునికి దానం చేయవలయును.

మార్కండేయ పురాణంలోని ఈ శ్లోకానికి స్కాంద పురాణంలో తెలిపిన వృత్తాంతం ఏమనగా కాంభోజ రాజును అన్నముతో అనుగ్రహించాలని అన్నపూర్ణా దేవీ పనె ్నండేళ్ళ పాపగా ఆకలి అంటూ దీనంగా యాచిస్తూ ‘తాత’ అంటూ అతని వద్దకు వచ్చెను. అప్పుడే తినబోతున్న మహారాజు తాత అన్న పిలుపుకు సంతోషించి తన ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆ పాపకు అన్నమును తినిపించసాగగా ఆమె తినసాగెను. ఆవిధంగా నాలుగు వేల మందికి వండిన టువంటి భోజన పదార్థాలు పూర్తయిపోగా వంటవారు రాజు వద్దకు వచ్చి ఇక వండుటకు పదార్ధాలు ఏమీ లేవని మొరపెట్టుకోగా అన్నమును ప్రసాదించమని చేతులు జోడించి రాజు అన్నపూర్ణను వేడుకొనెను. వడిలో కూర్చున్న పాప వంట గదిలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయని ఒకసారి వెళ్ళి చూడమని తెలిపి ఇప్పటి నుండి మీ ఇం ట్లో అన్నానికి కొదవ ఉండదని పిలిచినపుడు మరల వస్తానని రాజుతో పలికి ఆ పాప తరలిపోయెను.

కావున మన ఇంటి ముందుకు దేహీ అని వచ్చిన భిక్షకుడికి తాము తినే దానిలో కొంత తగ్గించుకుని అతనికి పెట్టాలని మార్కండేయ పురాణ ఉవాచ…

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement