Wednesday, April 24, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : భోజనం – 4 (ఆడియోతో…)

భారంతంలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

భోజనం…
నోచ్ఛిష్టం కస్యచిత్‌ అద్యాత్‌ నాద్యా చ్ఛైతత్‌ తధాంతరమ్‌

యస్త్వన్నమంతరా కృత్వా లోభాదపి నృపోత్తమ
వినాశం యాతి స నర: ఇహ లోకే పరత్రచ

ఇతరుల ఎంగిలిని ఎప్పుడూ తినరాదు. ఒకరు భుజించునపుడు మధ్యలో వచ్చి భుజించరాదు. అన్నం మీద లోభంతో మధ్యలో వచ్చి భుజించినచో ఆ నరులు ఇహపరములలో నశింతురు. భోజనం చేయుచూ సగంలో లేచి ఇతర పనులలోకి వెళ్ళినా, భోజనం చేస్తూ మనస్సును మరో విషయంపై మరల్చినా కోపముగా, కోరికగా, ఆశగా, పిసినారితనంగా భోజనం మధ్యలో ప్రవర్తించినా ఆ వ్యక్తి ఇహములోనూ, పరములోనూ నశించును. భోజనము మీదనే మనస్సును ఉంచి దాని రుచిని పొగుడుతూ పూర్తయ్యే వరకు మాట్లాడుకుండా భుజించేవారికి ఇహపరమున సుఖసంతోషములు కలుగును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement