Friday, April 19, 2024

ధర్మం – మర్మం : కార్తిక మాసమున మాలధారణ (ఆడియోతో…)

కార్తిక మాసమున మాలధారణ గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

కార్తిక మాసమున నెల రోజులు తులసీమాలను లేదా ధాత్రి(ఉసిరి) మాలను తప్పక ధరించవలెను.

నివేద్య కేశవే మాలాం తులసీ కాష్ట సంభవామ్‌
వహతే యోనరో భక్త్యా తస్యవై నాస్తి పాతకమ్‌
నజహ్యాత్‌ తులసీ మాలాం ధాత్రీ మాలాం విశేషత:
మహా పాతక సంహర్త్రీ ధర్మ కామార్ధ దాయనీ
స్పృశేత్తు యాని రోమాణి ధాత్రీ మాలా కలౌనృణామ్‌
తావత్‌ వర్ష సహస్రాణి వైకుంఠే వసతి: భవేత్‌

ఈ మంత్రము స్కాంద పురాణమున ద్వారకా మాహాత్మ్యం ద్వారా తెలుస్తోంది. శ్రీమన్నారాయణునికి తులసీమాలను లేదా ధాత్రి మాలను సమర్పించి కార్తికమాసమంతా ఏనాడూ విడువక భక్తితో మాలను ధరించాలి. ఈ రెండు మాలలు మహాపాతకములను నశింపజేసి ధర్మార్థకామములను ప్రసాదించును. ఈ మాలలు హృదయభాగమున ఎన్ని రోమములను స్పృశించునో అన్ని వేల సంవత్సరములు వైకుంఠములో అలాగే కోరుకున్నచో కోటి కల్పములు స్వర్గమున నివాసముండవచ్చును.

తులసీ కాష్ట సంభూతే మాలే కృష్ణ జన ప్రియే
బిభర్మి త్వామహమ్‌ కం ఠే కురుమాం కృష్ణ వల్లభమ్‌

- Advertisement -

అను మంత్రముతో తులసిమాలను ధరించవలెను.

తులసీ దళ ల క్షేణ కార్తికే యోర్చయేత్‌ హరిమ్‌
పత్రే పత్రే ముని శ్రేష్ట మౌక్తికం లభతే ఫలం

కార్తికమాసంలో కేశవునికి లక్ష తులసీ అర్చన చేసినచో ప్రతి తులసీ పత్రముతో ముక్తి లభించును.

వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement