Saturday, April 20, 2024

ధర్మం – మర్మం : దానగుణం -2 (ఆడియోతో…)

మహాభారతంలోని ఋషిప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

శిబి: ఔశీనరో అంగాని పుత్రం చ ప్రియం ఔరసం
బ్రహ్మాణార్ధం ఉపసృత్య నాకపృష్ట మితో గత:

ఉశీనర దేశపు రాజు అయిన శిబిచక్రవర్తి తనను శరణు వేడిన పావురాన్ని కాపాడుటకు డేగకు తన శరీర అవయవాలను కోసి ఇచ్చాడు. తాను రాజు కావున ఆ డేగను శిక్షించవచ్చు లేదా వధించవచ్చు కానీ పావురము డేగకు ఆహారము కావున దానిని ఆహారము తీసుకోకుండా నిలువరిస్తే మరేదైనా ఆహారం సమకూర్చాలి కావున ఆ ధర్మానికి కట్టుబడి తన అవయవాలను ఖండించి ఇచ్చినా పావురం బరువుతో సరితూగలేదు. తుదకు తన శిరస్సును కూడా ఖండించి ఇవ్వబోగా డేగగా ఉన్న ఇంద్రుడు తన అసల రూపంతో శిబిని నిలువరించాడు. అలాగే పావురంగా వచ్చినది అగ ్నదేవుడు. శిబిని పరీక్షించదలచి డేగ,పావురములుగా వచ్చిన ఇంద్రాగ్నులు అతని దానగుణానికి, త్యాగ గుణానికి మెచ్చి అఖండ సంపదలను, దీర్ఘాయిష్షును ప్రసాదించారు.

అదేవిధంగా తుంగధ్వజ మహారాజు బ్రాహ్మణునకు తన శరీరాన్నే దానం చేసి అఖండ సంపదలను, కీర్తిని సంపాదించాడని మహాభారతంలోని అశ్వమేధ పర్వంలో తెలుపబడింది.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement