Sunday, May 28, 2023

ధర్మం – మర్మం :

గంగా జలము మర ్త్యలోకమునకు చేరు విధానం – భూమి పై గంగాపయనం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

బ్రహ్మ తన కమండలంలోని జలముతో విష్ణువు పాదాలను కడుగగా శంకరుడు ఆ జలము శిరస్సున ధరించి మేరు పర్వతము నందు విడువగా గంగా జలము నాలుగు భాగములుగా భూమిపైకి చేరి పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తరములకు పయనించెను. దక్షిణ భాగంగా పయనిస్తున్న జలమును శివుడు తన జటలతో గ్రహించి తిరిగి కమండలమున చేర్చెను. ఉత్తరభాగంలోని జలమును సకల లోకాలకై శ్రీమహావిష్ణువు స్వీకరించెను. పూర్వ దిక్కున పడిన జలమును ఋషులు, పితృదేవతలు, దేవతలు స్వీకరించిరి. పశ్చిమ దిక్కున పడిన జలమును లోకమాతలు స్వీకరించిరి. బ్రహ్మ కమండలంలోని జలము విష్ణుపాదము నుండి జాలువారి శంకరుని జటాజూటమున నిలిచిన ఈ జలము త్రిమూర్తుల సంబంధం కలది కావున ‘త్రిదైవత్యమ’ని పేర్కొన్నారు. గంగా జల స్మరణ శుభమును, పవిత్రమును ప్రసాదించి, పాపములను హరించి, సకల కామనలు నెరువేర్చునని పురాణ వచనం.

- Advertisement -
   

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement