Friday, April 19, 2024

ధర్మం – మర్మం :


గంగా జలము మర్త్యలోకమునకు చేరు విధానము – బలిచక్రవర్తి దాన గుణ ం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

బలిచక్రవర్తి నిర్వహిస్తున్న యజ్ఞానికి విచ్చేసిన వామనుడికి బలి భార్యాసమేతంగా నమస్కరించి త మ రాకకు కారణమేమని అడగగా యజ్ఞము చేయడానికి తన అడుగుల సమానమైన మూడడగుల భూమి కావలెనని వామనుడు పలికెను. ఋషిముఖ్యులు, శుక్రాచార్యులు, దేవముఖ్యులు చూస్తుండగానే బలి రత్నమయ కలశం నుండి జలధారను విడిచి వామనుడికి మూడడగుల భూమిని దానం చేసెను. బలి చక్రవర్తి దానగుణానికి దేవదానవులందరూ జయ జయ ధ్వానాలు చేసిరి. వెంటనే వామనుడు యజ్ఞపురుషుడిగా త్రివిక్రముడై దర్శనమిచ్చెను. లోకములన్నీ అతని పాదముల పరిమితితో ఉండెను. అనంతుడు, అచ్యుతుడైన శ్రీమహావిష్ణువును చూసిన బలి శక్తి మేరకు పెరగమని, జగత్తు సృష్టికర్తయిన పరమాత్మ తనను యాచించినందుకు బలి సంతసించెను. శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు పెరుగుతూ
ఒక పాదాన్ని కూర్మపుష్టంలో ఉంచి మరొక పాదాన్ని బలి యజ ్ఞ భూమిలో ఉంచగా మూడవ అడుగుకు స్థానం ఏదని ప్రశ్నించెను. నీవు సృష్టించిన జగత్తును నీకే దానమిస్తున్నానంటూ నీవు సృష్టించిన జగత్తే నీకు అల్పమైనదంటూ నీకు సరిపోని జగత్తును సృష్టించడం నీ దోషమేనంటూ బలి పలికెను. కానీ ఇచ్చిన మాట ప్రకారం మూడో పాదమును తనపై ఉంచమనగా శ్రీహరి ప్రసన్నుడై బలిని వరాన్ని కోరుకోమనెను. తాను యాచకుడిని కానని తన దానానికి సంతోషించి ఏది ప్రసాదించినా స్వీకరిస్తానని బలి పలుకగా శ్రీమహావిష్ణువు సంతోషించి బలిచక్రవర్తికి రసాతలాధిపత్యాన్ని ప్రసాదించెను. త్రైలోక్య రాజ్యమును ఇంద్రునికి ఇచ్చెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement