Friday, April 26, 2024

ధర్మం – మర్మం :


గంగాజలము మర ్త్యలోకము చేరు విధానమును బ్రహ్మదేవుడు నారదునికి తెలిపిన వృత్తాంతము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

బ్రహ్మదేవుడు మహాదేవుడి వద్ద నుండి కమండలమును స్వీకరించి పాపవిముక్తుడవ్వగా అందులోని జలము మర్త్యలోకమునకు చేరిన విధానము గూర్చి వివరిస్తూ బలిచక్రవర్తి గొప్ప దైత్యుడు(దితి పుత్రుడు), దేవతలకు శత్రువు అని పలికెను. శుక్రాచార్యుల దయ వలన ఇంద్రాదులచే ఓడింపబడని వాడై మూడు లోకములను గెలిచి ధర్మముతో, యశస్సుతో, ప్రజారక్షణతో, గురుభక్తితో, సత్యముతో, బలపరాక్రమములతో, త్యాగముతో, క్షమతో మూడు లోకములలో సాటిలేని చక్రవర్తిగా ఎదిగెను. బలిచక్రవర్తి పాలనలో శత్రుబాధలు, శారీరక, మానసిక వ్యాధులు, అతివృష్టి – అనావృష్టి, అధర్మము మొదలగునవి లేవు. మూడు లోకాలలో నాస్తి అన్నది లేకుండా ఉన్న బలి చక్రవర్తి కీర్తిని, సంపదను చూసిన దేవతలు ముఖ్యంగా ఇంద్రుడు చింతాక్రాంతులయ్యిరి. అతని పరిపాలనా శక్తి వలన తమ కీర్తి మసకబారినదని, సుఖశాంతులకు దూరమయ్యామని భావించి అతని వైభవాన్ని చూసి సహించలేని దేవతలు శ్రీమహావిష్ణువుని శరణు వేడిరి.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement