Thursday, March 30, 2023

ధర్మం – మర్మం :


పార్వతీపరమేశ్వరుల పాణిగ్రహణంలో గంగా ఆవిర్భావం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

పార్వతీ పరమేశ్వరుల వివాహ విధి లో భాగంగా పార్వతి తన పాదమును బయటకు చాపగా ఆమె పాద సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైన బ్రహ్మ చలించి రేతస్సును స్కలనం తన పాదమును నేలకు రాయగా 60వేల మంది వాలకిల్య మహర్షులు ఆవిర్భవించెను. వాలకిల్యుల అవతార ఆవిర్భావం కోసం మహాదేవుడు బ్రహ్మలో వికారమును కలిగించెను. తనకు కలిగిన వికారమునకు చింతించిన బ్రహ్మను ఊరడిస్తూ మహాదేవుడు ఈ పాపమే కాక సకల పాపుల పాపమోక్షం కోసం సకల లోకాల హితం కోసం ఈ భూమి నుండి జలమును సంగ్రహించెదనని మహాదేవుడు పలికెను. సకల లోక జలసారమును తీసుకుని భూమిని కమండలము చేసి ఆ కమండలంలో ఈ జలమును నింపి పావమాన్య సూక్తములతో మంత్రించి ఆ జలములో అనంతకోటి బ్రహ్మాండములను పవిత్రం చేయు దివ్యశక్తిని మహాదేవుడు ప్రతిష్టింపచేసెను. ఈ కమండలమును బ్రహ్మచేతికి ఇచ్చి సకల లోకములకు జలము, భూమి మాతలని, లోకముల పుట్టుకకు, మనుగడకు, నాశములకు, భూమి మరియు జలమే హే తువులవునని మహాదేవుడు పలికెను.

- Advertisement -
   

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement