Thursday, March 28, 2024

ధర్మం – మర్మం :

గంగా ఆవిర్భావ వృత్తాంతంలో భాగంగా పార్వతీపరమేశ్వరుల వివాహ వేడుక గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

అరుంధతి వశిష్టులు, బ్రహ్మా సరస్వతులు, లక్ష్మీ నారాయణులు హిమవంతుని వద్దకు వెళ్లి శంకరునితో పార్వతీకళ్యాణానికి అంగీకరింపచేసెను.
పార్వతీపరమేశ్వరుల కళ్యాణానికి మూడులోకములు మురిసిపోగా ముక్కోటిదేవతలు, దానవ, గంధర్వ, యక్ష, విద్యారాదులు, సరస్సులు, సముద్రాలు మొదలైన వారంతా కళ్యాణానికి చేరుకొనిరి. మేరు, మందరాది పర్వతములు, వశిష్ట, అగస్త్యాది ఋషులు కూడా చేరుకొనెరి. వజ్రవైఢూర్య, మరకత మాణిక్యం, పుష్యరాగమయమైన స్తంభములతో జయా, లక్ష్మీ మొదలగు అష్టశక్తులతో కూడుకున్న వేదిక మీద నందిని, నంద, సునంద, కామధోహిణి అను కామధేనువులతో అష్టదిగ్గజములు, ఋషులు, లోకమాతలు వివాహప్రదేశానికి చేరుకొనెను. కుబెరుడు దానధర్మాలను, అగ్నిహోత్రడు యజ్ఞములను ఆచరించగా మిగిలిన పూజలను శ్రీమహావిష్ణువు జరి పించెను. గంధర్వ కిన్నెరులు గానం చేయచుండగా అప్సరసలు నాట్యం చేసెను. సకల అంగములతో కూడిన వేదములు స్వయంగా గానము చేస్తూ వేదార్థమును వివరించెను. పార్వతి సోదరుడు మైనాకుడు పేలాలను, సుగంధ ద్రవ్యాలను అతిథులపై చల్లెను. బ్రహ్మ అగ్నిని ప్రజ్వలింప చేసి హోమము ఆచరించి పార్వతీపరమేశ్వరులకు పాణిగ్రహమును జరిపించెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement