Friday, April 19, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు – దానపద్ధతి (ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…
దానపద్ధతి
20. దుర్భిక్షే చాన్నదాతారం సు భిక్షే చహిరణ్యదమ్‌
భయేచా భయ దాతార: స్వర్గేపి బహుమన్యతే

భయంకరమైన కరువు ఏర్పడినపుడు అన్నము పెట్టి వానిని, సుభిక్షకాలమున బంగారమును దానము చేసిన వానిని, భయము ఏర్పడినపుడు అభయము ఇచ్చిన వానిని స్వర్గమున కూడా చాలా బాగా గౌరవింతురు.

తన దగ్గర బాగా ఉన్నదానిని ఇచ్చుట కాదు. ఆ సమయమున, ఆదేశమున, ఆ ప్రాంతములో ఉన్నవారికి ఏది అవసరమో దానిని దానం చేయాలి. రోగ గ్రస్తునికి మందునీయాలి. ఆకలిగొన్న వానికి అన్నము పెట్టాలి. చలికాలములో గొంగడి దుప్పటి ఈయాలి. వరదలలో పడవనీయాలి అవసరమున్న దానిని అర్థించిన దానిని దానము చేసినవాడే నిజమగు దాత. అందుకే కరువులో అన్నమును పెట్టాలి. సుభిక్ష కాలములో పుష్టిగా ఉన్న శరీరానికి ఆభరణాలు, అలంకారాలు కావాలి అందుకే బంగారాన్ని దానం చేయాలి. ఇక భయము ఆపద ఏర్పడినపుడు అభయము నీయగలిగిన వాడు స్వర్గములో కూడా పూజింపబడును అనుచున్నారు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement