Thursday, September 21, 2023

ధర్మం – మర్మం : సుభాషితాలు (ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

అసత్య పద్ధతి
13. పంచ పశ్వనృతే హన్తి దశహన్తి గవానృతే
శతమ శ్వానృతేహన్తి సహస్రం పురుషానృతే

- Advertisement -
   

పశువు కోసము అబద్ధము ఆడినచో అనగా ఇతరుల పశువులను తనవి చేసుకొనుటకు, తన పశువులను ఇతరులకు ఈయకుండా ఉండుటకు అబద్ధము చెప్పినచో అయిదు తరములు నరకమును పొందుదురు. గోవు కొరకు అసత్యము పలికినచో పది తరములు వారు అలాగే అశ్వము కొరకు అసత్యము పలికినచో నూరు తరములు నరకమునకు వెళ్లుదురు. పురుషుని కొరకు అనగా మనిషి కొరకు అసత్యము పలికినచో వేయి తరములు నశించును అనగా నరకునకు వెళ్ళును. ప్రతి అసత్యమునకు ఒక కారణముంటుంది. తనకు లాభము కలుగుట ఎదుటివానికి నష్టము కలిగించుట లేదా తన సంపద పోకుండా ఉండుట ఎ దుటివాని సంపద తనకు వచ్చుట. ఆ సంపదలు పశువులు, గోవులు, అశ్వములు, నరులు వీరే కదా. అందుకే వీరి విషయమున ఆడిన అసత్యమునకు కలుగు ఫలితమును ఈ విధంగా తెలిపారు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement