Friday, October 11, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 12 (ఆడియోతో…)

గరుడ పురాణం, 16వ అధ్యాయంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

ప్రదక్షిణం ద్వయం కుర్యాత్‌ అశ్వమేధ ఫలం లభేత్‌
ఏక: కృష్ణ నమస్కార: ముక్తి తీరస్య దేశిక:

బ్రాహ్మణుడు, గోవు, దేవతా వృక్షములు కనబడినపుడు వాటికి రెండు ప్రదక్షిణములు చేసినచో అశ్వమేధయాగ ఫలం లభించును. శ్రీకృష్ణ భగవానునకు ఒక్క నమస్కారం చేస్తే ముక్తి తీరాన్ని చూపెడుతుంది.

అశ్వమేధ యాగము ఒక సంవత్సర కాలం చేయాల్సిన యాగము. యాగమునకు పనికి వచ్చే అశ్వాన్ని వెతికి తెచ్చుకుని ఆ అశ్వాన్ని ఒక సంవత్సరం భూమండలమంతా తిప్పుట అటు తర్వాత 16 రోజుల యాగము, 12 రోజుల ఆరాధన, దక్షిణ బహుమానములు, ఇతిహాస పురాణప్రవచనములు చేస్తే కానీ అశ్వమేధయాగము పూర్తి కాదు. ఇవేమీ అవసరం లేకుండా సదాచార సంపన్నుడైన బ్రాహ్మణునికి లేదా గోవుకు లేదా దేవతా వృక్షములకు రెండు ప్రదక్షిణములు చేస్తే ఆ ఆశ్వమేధ యాగ ఫలితము లభించును.

సదాచార సంపన్నుడైన బ్రాహ్ముణునిలో మరియు గోవులో 14లోకాలు అలాగే దేవతా వృక్షములలో అనంతకోటి బ్రహా ్మండాలు నిలిచి ఉన్నాయని పురాణ వాక్యం. కావున వీరి చుట్టూ ప్రదక్షిణం చేస్తే బ్రహ్మాండాలను తిరిగి వచ్చిన ఫలితం లభిస్తుంది. అశ్వమేధములోని పరమార్థం ఇంద్రియాలను వశంలో ఉంచుకొనుట. ఇంద్రియాలుమన వశంలో ఉండాలంటే దానికి సరిపోయే శక్తి మరొక ప్రదేశం నుండి తీసుకోవాలి. ఆ ప్రదేశమే సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడు, గోవు మరియు
దేవతావృక్షములు.

- Advertisement -

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement