Saturday, April 20, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 11 (ఆడియోతో…)

బృహస్పతి నీతిశాస్త్రంలోని ఋషి ప్రభోదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

స్మృతి: వ్యతీత విషయ మతి రాగామి గోచరా
స్మృతి: తాత్కాలికీ ప్రోక్తా ప్రజ్ఞా త్రైకాలికీ మతా

జరిగిన దానికి సంబంధించినవి స్మృతి, జరగబోయే దాన్ని తెలియుట మతి. స్మృతి అనేది తాత్కాలికము, ప్రజ్ఞ మూడు కాలాలలో ఉంటుంది.

జరిగిన దాని గురించి చెప్పుకోవడం లేదా తలచుకోవడం స్మృతి. రాబోయే దాన్ని గురించి ఆలోచించుట మతి. స్మృతి అనేది తాత్కాలికం మాత్రమే. జరిగిన దానిని గుర్తుచేసుకుంటే దాని వల్ల ప్రత్యేకించి వచ్చే లాభమేమి లేదు, గుర్తుచేసుకోవటంతోనే ముగుస్తుంది. బుద్ధి బలం కలవారు రాబోయే దాని ని కూడా ఊహించగలరు. ఇది కూడా ఇంచుమించు తాత్కాలికమే. కానీ ప్రజ్ఞ అనేది మాత్రం మూడు కాలాలలోనూ విశేషమైన ప్రభావాన్ని కనబరుస్తుంది.

- Advertisement -

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement