Monday, September 25, 2023

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 5 (ఆడియోతో…)

మహాభారతంలోని ఋషి ప్రభోదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

- Advertisement -
   

మృత్యో: భిభేషి కింమూఢ భీతం ముంచతి కిం యమ:
అజాతం నైవ గృహ్ణాతి కురు యత్న మజన్మని

అనగా మూర్ఖుడా! మరణమంటే భయపడుతున్నావా నీవు భయపడితే యముడు విడిచిపెడతాడా పుట్టని వాడిని యముడు పట్టుకోడు అందుకే పుట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయి మరణ భయం ఉండదు.

సంసారంలో కామక్రోధాలకు, రాగద్వేషాలకు వశమై అంతా నేనే అంతా నాదే అన్న అహంకార, మమకారాలను పెంచుకుంటే పుడుతూ చస్తూ ఉండాలి. పుట్టిన ప్రతీవాడు మరణించక తప్పదు. నేను నాది అని మానేసి భగవంతునితో నీవు నీది అనుకుంటే ఆయన దగ్గరకే చేరుతాము. అదే మోక్షం. మోక్షం కోసం ప్రయత్నం చేయమని వ్యాస భగవానుడు సున్నితంగా హెచ్చరించాడు.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement