Friday, October 11, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 4(2) (ఆడియోతో…)

మహాభారతం శాంతిపర్వంలోని ఋషి ప్రభోదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

కోపో మైత్రా వరుణ: శాపోవ తార్కికస్య మునే:
సంచింత్యతే యది మనాక్‌ శత్రోరపి మాస్తు శక్రపదమ్‌

అగస్త్య మహర్షి కోపాన్ని గౌతమ మహర్షి శాపాన్ని తలుచుకున్నచో ఇంద్ర పదవి శత్రువుకు కూడా వద్దనిపిస్తుంది.

గౌతమ మహ ర్షి శాపం :
తార్కిక ముని అనగా గౌతమ మహర్షి భార్య అయిన అహ ల్యను కామించిన ఇంద్రుడు అతను స్నానానికి వెళ్ళగా గౌతమ మహర్షి రూపమున అహల్య వద్దకు చేరి ఆమెతో గడిపెను. తిరిగి వెళ్ళబోతున్న ఇంద్రుడికి స్నానమాచరించి వచ్చిన గౌతముడు ఎదురైనాడు. విషయం తెలుసుకున్న గౌతమ మహర్షి నీ ఒళ్ళంతా స్త్రీ అవయవ చిహ్నాలే ఏర్పడతాయని శపించెను. తన తప్పును తెలుసుకుని ఇంద్రుడు గౌతముడిని ప్రార్థించగా ఇతరులకు నేత్రములవలె నీకు మాత్రము భగము వలె కనపడతాయని శపించెను.

- Advertisement -

ఇంద్రుడంతటివాడైనా ఇంద్రియ నిగ్రహం లేకుంటే అవమానాల పాలు, అధోగతిపాలు కాక తప్పదు. త్రైలోక్య రాజ్యం నాది అన్న అహం కారంతో తానేమి చేసినా అడ్డేమి ఉండదన్నా ధార్ష్ట్యముతో ప్రవర్తిస్తే అవమానం తప్పదు. కావున స్త్రీ వ్యామోహాన్ని, అధికార వ్యామోహాన్ని పెంచి శాపాలు, తాపాలు అందించే ఇంద్రపదవి శ్రతువుకు కూడా వద్దు.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement