Saturday, November 30, 2024

ధర్మం – మర్మం : కార్తిక మాసములో దీపారాధన విశిష్టత (ఆడియోతో…)

కార్తిక మాసములో దీపారాధన విశిష్టతను గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ..

పూర్ణిమ నాడు కృత్తిక నక్షత్రం వచ్చిన మాసాన్ని కార్తిక మాసము అంటారు. కృత్తిక నక్షత్రానికి అగ్ని అధిదేవత. ‘అగ్నిర్న:పాతు కృత్తికా’ అని వేద వాక్యం. చంద్రుడు సూర్య కాంతిని వె న్నెలగా మారుస్తాడు. సూర్యుడు సాయంకాలమున తన తేజస్సును అగ్నికి ఇచ్చి వెళతాడు. రుద్రుడు, అగ్ని , జలము, భూమి, వాయువు, ఆకాశం ఈ ఆరు కృత్తికా నక్షత్రంలో కుమారస్వామికి జన్మనిచ్చినవి. అందుకే ఆ స్వామిని ‘షాణ్‌ మాతుర: ‘అని అంటారు. కుమార స్వామి అగ్నికి , భూమికి, జలమునకు ప్రతీక కాగా భూమి ప్రమిద, జలము తైలము, వాయువు-ఆకాశము వతి,్త అగ్ని జ్యోతి(దీపం). ఇలా దీపము అంటే కుమార స్వామి, శంకరుడు మరియు వారికి ప్రేరకుడైన మహావిష్ణువు, పురుషకార భూతురాలైన లక్ష్మీ. వీరందరిని మనం దీపం రూపంలో కొలుస్తాం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తరువాత దీపారాధన చేయాలి. ఎందుకనగా ఆ సమయంలో సూర్యుడు అగ్నిలో ఉంటాడు. సూర్య భగవానున్నే అగ్ని రూపంలో ఆరాధించే మాసం కార్తిక మాసము.అందుకే కార్తిక దీ పానికి ప్రాధాన్యం. సూర్య చంద్రులు, వాయువు, అగ్ని వీరంతా ఆకాశవాసులు కావున ఈ మాసంలో ఆకాశ దీపంతో వారిని ఆహ్వానిస్తాం, ఆరాధిస్తాం.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement