Friday, April 26, 2024

ధర్మస్థాపనార్ధం ఆపద్ధర్మం!

అంతకంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో పాటించదగిన ధర్మాన్ని ఆపద్ధ ర్మం అంటారు. సాధారణ పరిస్థితులలో ప్రామాణికంగా ఉండి పాటించే ధర్మం కొన్ని అసాధారణ సందర్భాలలో పాటించటం కుదరని వేళ ఆ ఇబ్బందిని, సమస్యను, విపత్తును దాటటానికి, నిలువరించటానికి ధర్మా చారణలో చేసే చిన్న సవరణలు, మార్పులనే ఆపద్ధ³ ర్మమని అంటారు. అయితే ఇది పండితులు, వివేకవంతులు, పెద్దలు నిర్ణయించాలి. వారి ఆమోద ముద్ర కావాలి. అపుడే అది ఆపద్ధ³ర్మమైనా ధర్మ స్వభావాన్ని కించిత్తైనా కోల్పోదు. ధర్మంగానే భాసిల్లుతుంది.
నమ్మకాలు బాగా ఉన్నవారు, మంచిరోజు కాని రోజున ప్రయాణం చేయ వలసి వస్తే, ఆపద్ధర్మంగా ముందురోజే పక్కింట్లోనో, తెలిసిన వారింట్లోనో ప్రయా ణపు సంచీని (నిర్గమం) పెట్టుకుని, ఆ రోజు వారింటి నుంచే ఆ సామాను తీసు కుని బయలుదేరి వెళతారు. ఆచరించవలసిన విధివిధానాలకు వీలుకాని పరి స్థితుల్లో ఆపద్ధర్మంగా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తూ ఉంటాము. పూజలు, వ్రతాలు వంటివి శాస్త్రోక్తంగా చేసుకోవటానికి పురోహతులు అందు బాటులో లేనపుడు, వీలుకాని సందర్భాలలో స్పష్టత, వాక్శుద్ధి ఉన్నవారు మంత్రాలు చదువుతూ పూజాక్రతువును నిర్వహంచడం ఆపద్ధర్మమే.
బ్రహ్మస్త్ర, నారాయణాస్త్ర ప్రయోగ, ఉపసంహారాలు తెలిసిన ధనుర్విద్యా నిపుణుడు, మహాయోధుడైన ద్రోణాచార్యుణ్ణి ఎదురిడి సమరం చేసే సాహసం ఎవరు చేయలేకపోయారు. ఆ అద్భుత అస్త్ర, శస్త్రాలు ఆయన చేత ఉన్నవేళ ఆయనను నిలువరించటం దేవతలకైనా అసాధ్యమే. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన శౌర్య ప్రభంజనా విపత్తును ఆపటానికి శ్రీకృష్ణుడి హతవు మీద, ధర్మ రాజు… ‘అశ్వత్థామ హత:, ఇతి నరోవ కుంజరోవా” అని పలుకుతాడు. అంతే ఆ మాటలు ఆ యోధుడి చెవిని సోకిన ఉత్తర క్షణం ఆయన అస్త్రాలు నేలకొరిగాయి, ఆయన సంహారం సాధ్యమైంది. ఇది ఆపద్ధర్మానికి గొప్ప ఉదాహరణ. ధర్మ స్థాపనకై ఏర్పడ్డ ధర్మమిది.
ఆపద్ధర్మం పూజా విధానాన్ని అనుసరించి చేసుకుంటూ ఉంటాము. ఏకా దశి, కార్తీక సోమవారాలు వంటి ప్రత్యేక పర్వ దినాలలో ఉపవాసం ఉండాలని భక్తజనులు భావిస్తారు. కాని, వారి దేహస్థితి, ఆరోగ్యం సహకరించనపుడు ఆపద్ధ ర్మంగా కఠిన ఉపవాసం కాకుండా పళ్ళు, పాలు వంటివి తీసుకోవచ్చని పెద్దలు చెపుతారు. శారీరక ధర్మ స్పృహ అంటే ఇదే.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులు విద్యాలయాల్లో నేర్చుకునే విద్యను ఇంటి నుండే నేర్చుకుంటున్నారు. పరీక్షలు లేకుండానే పై తరగతులలో ప్రవేశి స్తున్నారు. ఇవీ ఆపద్ధర్మ చర్యలే! విద్యార్థులు వీటికి అలవాటు పడిపోకూడదు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించటానికే ప్రయత్నించాలి. ఆపద్ధర్మ కష్ట కాలంలో మాత్రమే పాటించవలసిన విధి.
మధుమేహ పీడితులకు చాలా ప్రమాదకరమైన స్థితి గాంగ్రెన్‌. నరాలు దెబ్బతిని, రక్తప్రసరణ కాని వేళది. వైద్యంలేని స్థితిలో, గత్యంతరం లేక వైద్యులు ఆ దెబ్బతిన్న భాగాన్ని విచ్ఛేదనం చేస్తారు. రోగి ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ అవయవాన్ని తొలగిస్తారు. జీవితాన్ని రక్షించటమనే ధర్మం అవయవ ఖండ నమనే ఆపద్ధర్మమయ్యింది. పర స్త్రీలను తాకకూడదన్న ధర్మం నదీ ప్రవాహం లో కొట్టుకుపోయే స్త్రీని రక్షించే సమయాన యుక్తంకాదు. ఆచరణలో విచక్షణ, వివేచన కావాలి. అక్కడ ఒక జీవి అన్న భావన రావాలి.
వాహనాన్ని నడుపుతున్న వేళ ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపటానికి ఒక చిన్న ప్రమాదానికి వాహనాన్ని గురిచేయటం ఆపద్ధర్మమే. ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రయాణీకుల ప్రాణాలు రక్షించటానికి ఒక వ్యక్తికో లేదా ఒక జంతువుకో ఆ ప్రమా దాన్ని పరిమితం చేయటం ఆపద్ధర్మమవుతుంది. క్రమశిక్షణలు, దండన, మంద లింపు, హతవు ఆపద్ధర్మంలో భాగాలే.
ధర్మ సంక్లిష్టత ఏర్పడినపుడు, ధర్మ సూక్ష్మంలో స్పష్టాస్పష్టత తెలియనప్పు డు, ఇతమిద్ధంగా ధర్మమిదని తోచనినాడు, ఏర్పరచుకున్న ధర్మ శాస్త్రాలు ఉప యోగించి ధర్మ నిర్ణయం చేయలేనపుడు నాటి కాల, మాన, సామాజిక పరిస్థితు లకు అనుగుణంగా ధర్మ ఔన్నత్యానికి భంగం వాటిల్లకుండా తయారుచే సుకునే ప్రవర్తనా నియమావళే ఆపద్ధర్మం.

Advertisement

తాజా వార్తలు

Advertisement