Friday, March 29, 2024

ధ‌ర్మం మ‌ర్మం – మార్గశిరమాస విశిష్టత

విష్ణుభక్తాశ్చ యే కేచిత్‌ సర్వే వర్ణా ద్విజాతయ: |
కధితం మమ గార్గ్యేణ గౌతమేన సుమంతునా ||

యేత్వ భక్తా హృషీకేశే పిశాచాస్తే హి మానవా: |
మహాపాతక యుక్తాస్తేయే భుంజంతి హరేర్దినే ||

శివవ్రత సహస్రైస్తు సౌరైర్బ్రాహ్మైశ్చ కోటిభి: |
యత్ఫలం కవిభి: ప్రోక్తం వాసరైకేన తద్ధరే: ||

గర్వముద్వహతే తావ త్తిధిర్బ్రాహ్మీచ శాంకరీ |
యావన్నా యాతి విప్రేన్ద్ర ద్వాదశీ చ మమ ప్రియా ||

తావత్ప్రభావస్తారాణాం యావన్నోదయతే శశీ |
తిధిస్తధాచ విప్రేన్ద్ర యావన్నాయాతి ద్వాదశీ ||
విష్ణుభక్తులైన సకల వర్ణములు ద్విజాతులే. ఈ విషయమును నాకు గార్గ్యుడు గౌతముడు సుమంతులు చెప్పియున్నారు. హృషీకేశుని యందు భక్తి లేనివారు పిశాచములు శ్రీహరి దినమైన ఏకాదశినాడు భుజించువారు మహాపాతకులు అయ్యెదరు. వేయి శివవ్రతములు సూర్యవ్రతములు బ్రహ్మవ్రతములు కోటి ఆచరించిన కలుగు ఫలము ఒక్క ఏకాదశి వ్రతముతో లభించును. బ్రహ్మ తిథి, శంకర తిథి, నాకు ప్రియమైన ద్వాదశి రానంతవరకే గర్వించు చుండును. చం ద్రుడుదయించినంత వరకే తారల ప్రభావము కదా! అట్లే ద్వాదశి రానంతవరకే ఇతర తిథుల ప్రభావము.

- Advertisement -

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement