Saturday, April 20, 2024

ధ‌ర్మం మ‌ర్మం – మార్గశిరమాస విశిష్టత

విష్ణుమూర్తి నైవేద్య విధిని తెలుపుతూ

ఘృతక్షీర సితాద్యాస్తా, కటాహేను, ప్రలోడితా ! |
లబ్ధాసితాది కృసర రమ్యా! స్నిగ్ధాశ్చపేణికా: ||

ఏరాకి కా సువై పక్వా: కృతాశ్చంద్రేణ పోలికా: |
మోదకా స్తత్ర వై కార్యా: చారబీజభవా: పరే ||

సితయా సహితా: కార్యా అన్యేన దుగ్ధేన నిర్మితా: |
నారికేల ఫలైశ్చాన్యే వృక్షనిర్యాస నిర్మితా: |

బదామైశ్చ శుభాశ్చాన్యే తిలైశ్చ కణవీజకై: |
ఈదృశాన్మోదకాం శ్చాన్యాన్‌ తుష్ట్యర్థం మమ కారయేత్‌ ||

- Advertisement -

అర్శఘ్నం మోచనీ కుందం తధార్థ్రం కారమర్థకమ్‌ |
నారింగా చించిణీకం చ కంకోల ఫలమేవచ ||

నేయి, పాలు, శర్కరాదులు ఒక పెద్ద పాత్రలో చక్కగా కలిపి నువ్వులతో ఉండలు అందమైన వాటిని చేయవలయును. స్వచ్ఛముగా నున్నగా ఉన్న పేణీలు, మూకుళ్ళలో పక్వమైనవి మీగడతో చేసిన భక్ష్యాలు, పోలాలు, లడ్డూలు, వేరుశనగపలుకులతో జీడిపప్పుతో ఎండు ద్రాక్షతో కలిపినవి శర్కరతో కలిపిచేయవలయును. మరి కొన్ని పాలతో చేయవలయును. కొబ్బరినూనెతో కొన్ని ఫలరసముల తో కొన్ని, బాదంకాయలతో, నువ్వులతో ఇతర ఫల బీజములతో చేసినవి నా సంతోషము కొరకు ఇటువంటి ఇతర మోదకములతో చేయవలయును. పలకలపై చేయునవి, వస్త్రముపై చేయునవి, చేతితో మర్దించి చేయునవి, నారింజ, కమలా, కంకోల ఫలములతో చేయవలయును.

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement