Saturday, November 30, 2024

ధర్మం – మర్మం : కార్తిక మాసంలో వెలిగించే ఆకాశ దీపాల ప్రత్యేకత (ఆడియోతో…)

కార్తిక మాసంలో వెలిగించే ఆకాశ దీపాల ప్రత్యేకత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

కార్తిక మాసం దేవతలకు ముఖ్యముగా హరిహరులకు, ఋషులకు, పితృదేవతలకు, పితృపతి యమ ధర్మరాజునకు ప్రియమైన మాసము. ఆకాశదీపమును యమ దీపమని కూడ వ్యవహరిస్తారు. అయితే సామాన్యంగా దీపం వెలిగించి దేవతలను, ఋషులను ఆహ్వానిస్తాం. ఆకాశదీపారాధన చేసి యమ ధర్మరాజును తమ వైపు రావద్దు అని ఆకాశానికి దీపాన్ని చూపాలి అపుడు ఆకాశ దీపాన్నిచూచి యముడు తిరిగి తనలోకానికి వెళతాడని ఆకాశ దీపం కనపడని ఊరికి, ఇంటికి వస్తాడని పురాణ వచనం. మోక్షం కోరినా, కోరకున్నా యముడు రావద్దని అందరు అనుకుంటారు. కావున ప్రతి ఒక్కరూ ఆకాశదీపాన్ని ఈ కార్తిక మాసములో వెలిగించి ఇష్టదైవాన్ని, పితృ దేవతలను ఆహ్వానించి పితృపతిని మాత్రం ఆశీస్సులు అందజేయమని మాత్రమే కోరుతాం. ఆకాశ దీపం ఉన్న ఇంటికి లక్ష్మీ నారాయణులు వస్తారని లేని ఇంటికి యమధర్మరాజు వస్తాడని స్కాందపురాణ వాక్యం.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement