Friday, April 19, 2024

ధర్మం – మర్మం : కార్తికమాస విధులలో ధాత్రీ వృక్ష విశిష్టత (ఆడియోతో..)

కార్తికమాస విధులలో ధాత్రీ వృక్ష విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

ధాత్రీ ఛాయేతు య: కుర్యాత్‌ దీప దానం విశేషత:
పిండ దానం చ యో భక్త్యా నర: కుర్యాత్‌ విశుద్ధధీ:
ముక్తిం ప్రయాంతి పితర: ప్రసాదాన్‌ మాధవస్యతు

అనగా కార్తికమాసంలో ప్ర తీ రోజూ సూర్యోదయమునకు ముందే ధాత్రీ వృక్ష మూలమున దీపమును ఉంచవలెను. అలాగే మధ్యాహ్న సమయమున ధాత్రీ వృక్ష ఛాయలో పితరులకు పిండదానము చేసినచో మాధవుని దయతో పితృదేవతలు ముక్తిని పొందుతారు.

ధాత్రీ ఫల విలిప్తాంగ: ధాత్రీ ఫల విభూషిత:
ధాత్రీ ఫల కృతాహర: నరో నారాయణోభవేత్‌
ధాత్రీ ఛాయాం సమాశ్రిత్య యోర్చయేత్‌ చక్రధారిణం
పుష్పే పుష్పే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోతి మానవ:

ధాత్రీ ఫల రసమును శరీరానికి రాసుకుని స్నానమాచరించి ధాత్రీఫల మాలను ధరించి ధాత్రీఫలమునే ఆహారముగా తీసుకొను నరుడు నారాయణుడగును. ధాత్రీ వృక్షఛాయలో శ్రీహరిని పుష్పములతో లేదా తులసీ దళములతో పూజించిన ప్రతీ పుష్పమున, ప్రతీ తులసీ దళము వలన అశ్వమేధ ఫలము లభించును. ఈ మాసమున ధాత్రీ వృక్షఛాయలో రాధాదామోదరులను పాయసము, చిత్రాన్నములతో పూజించి హోమం చేసి, బ్రాహ్మణులకు భోజనం ముందు వడ్డించి పిదప బంధువులతో కలిసి భుజించవలయును.

- Advertisement -

వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement