Thursday, November 7, 2024

ధర్మం – మర్మం :

గౌతమీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

గౌతమీ వైభవం గూర్చి బ్రహ్మ నారదునికి ఈ విధంగా వివరించెను.

భాగీరధీ నర్మదా చ యమునా చ సరస్వతీ
ఆయాన్తి భీమరధ్యాద్యా స్నాతుంసింహగతే గురౌ
విహాయ గౌతమీంగంగాం తీర్థాన్యన్యాని సేవితుమ్‌
యేయాన్తి మూఢాస్తేయాంతి నిరయం సింహగే గురౌ
తిస్ర: కోట్యోర్ధ కోటీచ యోజనాం శతద్వయే
తీర్థాని మునిశార్ధూల సంభవిష్యన్తి గౌతమ
ఇయం మహేశ్వరీ గంగా గౌతమీ వైష్ణవీతిచ
బ్రాహ్మీగోదావరీ న న్దా సునన్దా కామదాయినీ
బ్రహ్మతేజ స్సమానీతా సర్వపాప ప్రణాశినీ
స్మరణాదేవ పాపేఘహన్త్రీ మమ సదా ప్రియా

తాత్పర్యము :
గురువు సింహరాశిలో ఉన్నప్పుడు భాగీరధీ, నర్మదా, యమునా, సరస్వతీ, భీమరధీ మొదలగు నదులు గోదావరిలో స్నానము చేయుటకు వచ్చును. గురువు సింహరాశిలో ఉన్నప్పుడు, గోదావరీ తీర్ధమును విడిచిపెట్టి ఇతర తీర్థములకు వెళ్ళు మూఢులు నరకమును పొందెదరు. గురువు సింహరాశిలో ఉండగా మూడొందల యాభౌ కోట్ల తీర్థములు గోదావరీ తీర్థమునకు రెండు వందల యోజనముల దూరములో ఉన్న తీర్థములలో వచ్చి చేరును. ఈ గోదావ రీ, మహేశ్వరీ, గంగ, గౌతమీ, వైష్ణవీ, బ్రాహ్మీ, నందా, సునందా, కామదాయినీ, బ్రహ్మతేజస్సామానీత సర్వపాప ప్రణాశిని శివప్రియ అని పదకొండు నామములను స్మరించినంతనే సకల పాపరాశులను నశింపజేయును.

- Advertisement -

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement