Sunday, December 8, 2024

ధర్మం – మర్మం : ఉపవాసం చేసేవారు పాటించే నిద్రానియమం (ఆడియోతో…)

ఉపవాసం చేసేవారు పాటించే నిద్రానియమం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

‘ ఉపవసతేతీ ఉపవాస: ‘ (ఉప అంటే దగ్గర) ఉపవాసం ద్వారా భగవంతుని దగ్గర మన మనసును ఉంచుట. భగవంతుని నుంచి మనల్ని దూరం చేసేది ఆహారం, నిద్ర.
ఆహారంలో వైకుంఠం చూసేవారు ఆ భగవంతునికి దూరంగా ఉంటారు. ఆయనకు సన్నిహితంగా ఉండుగోరువారు ఆహారం, నిద్ర రెండూ మానాలి. ఉపవాసం చేసిన
రోజు రాత్రి కూడా నిదురించరాదు. సంసారిక విషయాలను మాట్లాడరాదు. పరమాత్మ యందు మనస్సు ఉంచితే వాక్కు కూడా పరమాత్మ యందే ఉంచాలి. భగవంతుని నామాన్ని స్మరించాలి. ఆయన కథలే వినాలి. ఆయన కీర్తనలు పాడాలి. ఈ విధంగా భగవంతుని పలు విధాలుగా ఆరాధించాలి.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement