Friday, March 29, 2024

కర్మ ఎలా ఉంటుంది

శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లి దండ్రులైన వసుదేవుడు దేవకిలను చూడటానికి, వారికి కా రాగారం నుండి విముక్తి కలిగించడానికి వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు. దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే ”నాయనా! నీవే పరమాత్మవి కదా!! నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి, అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగా వు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి” అని అడిగింది.
అప్పుడు కృష్ణుడు ”అమ్మా! నన్ను క్షమించు, నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో?” అని అడిగాడు చిరునవ్వుతో!
దేవకి ఆశ్చర్య చకితురాల యింది,
”కష్ణా ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా” అని అడిగింది.
దానికి కృష్ణుడు ”అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ నీవు గ త జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు…!” అన్నాడు.
దేవకి మరింతగా ఆశ్చర్యపడింది. కుతూ#హలంగా ”అయితే ఈ జన్మలో కౌసల్య ఎవరు?” అని అడిగింది.
”ఇంకెవరు? యశోద మాత! గత జన్మలో 14 సంవ త్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు. అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది.” అన్నాడు శ్రీకృ ష్ణుడు మందహాసంతో.
ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్ప దు. భగవద్భక్తులైనా, అవతార పురుషులైనా వాటి నుం డి తప్పించుకోలేరు. ఇక మానవ మాత్రులం అయిన మనమెంత!!


– సిహెచ్‌.హరిబాబు, 98495 00354

Advertisement

తాజా వార్తలు

Advertisement