Thursday, March 28, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24 గంట‌ల స‌మ‌యం..

తిరుమల : క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు భారీగా త‌ర‌లి వ‌స్తున్నారు. అయితే భ‌క్తులు అధిక సంఖ్య‌లో విచ్చేయ‌డంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచిఉండ‌గా.. దర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. బుధవారం శ్రీవారిని 68,850 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.21,280 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

శ్రీవాణి దర్శనం టికెట్ల కోటా రోజుకు 1000కి పరిమితం

శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1,000కి పరిమితం చేసింది. ఇందులో ఆన్‌లైన్‌లో 750, ఆఫ్ లైన్ లో 250 టికెట్లను జారీ చేస్తారు. మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. ఇక నుంచి శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌ను అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్‌ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఆఫ్‌లైన్ టిక్కెట్లు జారీ చేస్తారు. శ్రీవాణి దాతలు బ్రేక్ దర్శనం టికెట్‌కి బోర్డింగ్ పాస్‌ను జతచేయాలి. టికెట్ పై ఎయిర్‌లైన్ రిఫరెన్స్‌తో కూడిన పిఏన్ అర్ నంబర్‌ను కూడా నమోదు చేయించాలి. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని సిబ్బంది బ్రేక్ దర్శన టిక్కెట్‌తో పాటు బోర్డింగ్ పాసును తనిఖీ చేసి దర్శనానికి అనుమతిస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement