Friday, April 19, 2024

చర్మన్వతి నది

నదులలో గంగానది అన్నిటికంటే శ్రేష్ఠమయినది. యమున, సరస్వతి, నర్మ ద, గండకి, సింధు, గోమతి, తమసా, కావేరీ, చంద్రభాగ, పుణ్య, నేత్రవతి, చర్మన్వతి, సరయూ, నదులు పెద్దవి. చిన్నచిన్న నదులనేకములున్నవి. ఈ నదుల లో సముద్రం వరకు చేరు నదులు అధిక పవిత్రములు అని, సముద్రము వరకు వెళ్ళ ని నదులను అల్పపుణ్యములని చెప్పుదురు. సముద్రమును చేరు నదులలో అగా ధమైన జలముతో సదా నిండియున్న నదులు అధిక పవిత్రములు.
పెద్ద నదులుగా చెప్పబడిన వాటిలో చర్మన్వతి నది ఒకటి. దీనిని ఇప్పుడు చం బల్‌ నది అని పిలుస్తున్నారు.
చంబల్‌ నది భారతదేశంలోని ఉత్తర మరియు ఉత్తర మధ్య భాగంలో రాజస్థా న్‌- మధ్యప్రదేశ్‌లోని ధార్‌, ఉజ్జయిని, రత్లం, మందసౌర్‌, భింద్‌, మురైనా తదితర జిల్లాల గుండా ప్రవహస్తుంది. చంబల్‌ నది మధ్య భారతదేశంలోని యమునా నది కి ఉపనది. ఈ నది ”జనపవ్‌ పర్వతం” మోవ్‌ నుండి ఉద్భవించింది. దీని ప్రాచీన నామం ”చరమావతి”. ఇది శాశ్వత నది. బనాస్‌, క్షిప్రా, శివనా, కాళీసింధ్‌, పార్వతి, ఛోటీ కలిసింద్‌, కునో మొదలైనవి చంబల్‌ యొక్క ఉపనదులు.
భారతదేశాన్ని నదుల దేశమని అంటారు. ఈ నదులు జనం నుంచి పూజలను కూడా అందుకుంటాయి. అయితే వీటికి భిన్నంగా ఉన్న ఒక నది చర్మన్వతి. ఈ నది ఈనాటిది కాదు శతాబ్దాల క్రితం నాటిది. మహాభారతంలో దీనిని చర్మణ్యవతిగా పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో రాజు రంతిదేవుడు తాను చేసిన యాగంలో పెద్ద సంఖ్యలో జంతువులను బలి ఇచ్చాడని, వాటి రక్తమంతా ఈ నదిలో ప్రవ#హం చేలా చేశాడని చెబుతారు. చర్మన్వతి నది శబ్దవ్యుత్పత్తి శాస్త్రం ప్రకారం చంబల్‌ పురా తన పేరు ”చర్మన్వతి”, కాలక్రమేణా, ఈనది ‘చమ్ర’ (చర్మం)నదిగా ప్రసిద్ధి చెందిం ది. చర్మన్వతి అని పేరు పెట్టబడింది.
మహాభారతం ప్రకారం, ఈ నది రంతిదేవ రాజు త్యాగాలలో సేకరించిన తేమ తో కూడిన చర్మం నుండి ఉద్భవించింది. సంస్కృత కవి కాళిదాసు రచించిన మేఘ దూతంలో చర్మన్వతి నదిని రంతిదేవుని కీర్తికి స్వరూపంగా కూడా పిలిచాడు. దీని తరువాత దక్షిణ దిగ్విజయ యాత్రలో భాగంగా సహదేవుడు చర్మన్వతి ఒడ్డున భూరిబలుడి పుత్రుడైన జంభకుడిని చూశాడు. భాగవతంలో నర్మదానదితో పాటు గా చర్మన్వతి ప్రస్తావన ఉంది. మహాభారతంలో చర్మన్వతిలో అశ్వనది, యమునాలో చర్మన్వతి, గంగా నదిలో యమునా సంగమం ప్రస్తావన ఉంది.
పూర్వం రంతిదేవుడను రాజేంద్రుడు, రాజైననూ మహాయోగి వలె విషయ వాంఛలకు లోనుగాక నిరంతరం హరినామ స్మరణతో కాలం గడిపేవాడు. దైవవ శమున లభించిన దానితోనే తృప్తిపడేవాడు.ఆరాజు తన సంపదలను దానం ఇచ్చి ఇచ్చి బీదవాడైనాడు. కుటుంబంతో సహా చాలా కష్టాలపాలైనాడు. నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్ళు లేకుండా సకుటుంబంగా తిరుగాడవలసి వచ్చినా గుండె దిటవును కోల్పోలేదు.
ఒకరోజు ప్రాత:కాలమున అతనికి నెయ్యి, పాయసము, నీళ్ళు లభించాయి. భోజనకాలం వచ్చాక రంతిదేవుడు సకుటుంబముగా భోజనము చేయడానికి సిద్ధపడ్డాడు. భరింపరాని క్షుత్పిపాసల బాధ తీర్చుకుందామని అనుకుంటుండగా ఓ దీన బ్రా#హ్మణుడు అతిథియై వచ్చాడు. రంతిదేవుడెంతో ప్రేమతో అతని గౌరవిం చి హరి సమర్పణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతడికిచ్చాడు. ఆ విప్రుడు కడు పారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు.
ఇంతలో ఒక శూద్రుడు వచ్చి అన్నంపెట్టమని అడిగాడు. వచ్చిన అభ్యాగ తునిలో భగవంతుడిని దర్శించి ఆదరంతో ఆ శూద్రునికి ఆహారంలో ఒకభాగాన్ని చ్చాడు రంతిదేవుడు. వాడు సంతృప్తిగా తిని వెళ్ళాడోలేదో కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు. ”రాజా! నేను ఈ కుక్కలు ఆకలిచే మిగుల పీడితులమై యున్నాము. మా కు సరిపోయే ఆహారము ఇమ్ము” అని వాడన్నాడు. అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచిమాటలాడి పంపాడు రంతిదేవుడు.
ఇక రంతిదేవుని వద్ద నీళ్ళొకటి మిగిలాయి. అదీ ఒక్కడికి సరిపోయేవే ఉన్నా యి. దప్పికతో ప్రాణాలు కడగడుతున్న రంతిదేవుడు అవి త్రాగబోగా ఓ చండాలు డు వచ్చి ఇలా అన్నాడు ”అయ్యా!నేను చాలా దీనుడను. చాలా దా#హంగా ఉంది. నీరసముతో అడుగు ముందుకు వేయలేకున్నాను. నీవద్దనున్న నీటితో నాగొంతు తడిపి నాప్రాణాలు నిలబెట్టు”. ఆయాసంతో దా#హంతో ఉన్న ఆ దీనుని చూచి ”ఓ అన్నా! నావద్ద అన్నం లేదు కాని ఈ తీయ్యని నీళ్ళున్నాయి. దగ్గరకురా. నీ దా#హం తీరేటట్లు త్రాగు. ఆపద కలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థమేమున్నది మానవులకు”? అని రంతిదేవుడన్నాడు. తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్కచేయక రంతిదేవుడు ”నా జలదానంతో ఈతడి బాధ, ఆయా సం, దా#హం తొలగితే నాకంతే చాలు. అంతా ఈశ్వరేచ్ఛ” అని ఆ చండాలుని పాత్ర లో నీళ్ళు పోశాడు.
బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమై జరిగినదంతా విష్ణుమాయా ప్రభావం అని చెప్పారు. బ్రా#హ్మణ శూద్ర చండాల వేషములలో వచ్చి నది వారే అని ఎఱుక కల్గించి ఆశీర్వదించారు. రంతిదేవుడు వారికి నమస్కరించి నాడు. ధీరుడైన రంతిదేవుడు వారిని ఏదీ కోరలేదు. స్థిరమైన విష్ణుభక్తులకే కోరిక లుండవు కదా! కడకు విష్ణుపదాన్ని పొందాడు. ఆ రాజేకాదు, ఆ రాజు కథను బాగా విని అర్థంచేసుకున్న వాళ్ళందరూ ఆతని మ#హమచే యోగులై కడకు మోక్షం సంపా దించారు.
చర్మన్వతి నది ఒక పురాణ నది. పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడింది. పురాణశాస్త్రం ప్రకారం ఈ నది యొక్క ఆధునిక పేరు ”చంబల్‌” తెలుగువంటికొన్ని ద్రావిడ భాషలలో ‘చేప’అనిఅర్ధం. ద్రావిడుల చరిత్ర ప్రకారం, మత్స్య పాలకులు ఈ నది ఒడ్డు నుండి వారి మూలాన్ని కలిగి ఉన్నారు. మత్స్య అనే పదానికి సంస్కృతం లో చేప అనే అర్థం కూడా ఉంది. ఆ విధంగా ఈ నది ఒడ్డు ఒక మత్స్యకారుల సమా జంగా భావించబడుతుంది, వారు తరువాత రాజ్యాధికారాన్ని పొందారు. చర్మన్వ తి పాంచాల రాజ్యానికి దక్షిణ సరిహద్దు.ద్రుపద రాజుచర్మన్వతి నది ఒడ్డు వరకు దక్షిణ పాంచాలను పాలించేవాడు.
ఒక పురాణగాథ ప్రకారంమహాభారతకాలంలో, కుంతి తన నవజాత శిశువు కర్ణుడిని ఒక బుట్టలోవదిలి చర్మన్వతికి తరలించగాఅది అశ్వనదిలో తేలుతుంది. చంబల్‌ ప్రాంతం శకుని రాజ్యంలో భాగంగా ఉండేది. శకుని తన మేనల్లుడు దుర్యో ధనుడి కోసం పాండవుల రాజ్యాన్ని గెలుచుకున్న, అపఖ్యాతి పాలైన పాచికల ఆట ఇక్కడ జరిగింది. ద్రౌపది వస్త్రాప#హరణ ప్రయత్నం తరువాత (ద్రుపద రాజు కు మార్తె) చర్మన్వతి నది నీటిని ఎవరు తాగుతారని ఆమె శపించింది.అప్పటి నుంచి ఈ నది మొత్తం ఎర్రగా మారిపోయి కలుషితమైపోయింది. దీంతో జనం ఈ నదిలో ని నీటిని ఉపయోగించడం మానేశారు.ఫలితంగా ఈనదిని ఎవరూ పూజించరు. ఈ నదిని ‘చంబయ్‌’ నది అని, తిరుగుబాటుదారుల నదిఅనికూడా అంటారు. ఈ నది నీరు తాగినవారు తిరుగుబాటుదారులవుతారని అంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం దోపిడీదారులతో నిండి ఉండేది. అయితే ప్రస్తుతం ఇక్కడ శాంతిభద్రతలు అదుపు లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ నది సమీపంలో వారు ఈ నీటిని వినియోగిస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement