Thursday, December 5, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

సంతృప్తి ఒక సంపద
సంపద వలన సంతోషం కలుగుతుంది. అన్నట్లుగా సంతోషానికి ఒక గొప్ప కారణము సంతృప్తి అనవచ్చు. మరి సంతృప్తి అనే సంపదను మరో సంపద కోసం వదులుకోవడం సరైనదేనా? నిజమైన సత్ప్రవర్తన ఏమిటంటే ప్రస్తుత ఆపద్కాలంలో మనిషి ప్రశాంతంగాఉంటూ ఆపదలను ఎదుర్కొన లేక అంతం చేసే సక్రమమైన మార్గాన్ని ఏర్పరచుకోవడం. మన వర్తమానం మన గత కర్మల ప్రభావము అని భావిస్తూ భవిష్యత్తు గురించి జాగ్రత్తగా వ్యవహరించాలి. భోజనము శరీరానికి పోషణ ఇచ్చినట్లుగా మనసుకు సంతోషము పోషణను కలిగిస్తుంది. అందుకే సంతోషం వంటి ఆహారం లేదు అని అంటారు. సంతోషంగా ఉండటానికి సంతృప్తిగా ఉండాలి. శారీరిక ఆరోగ్యం కోసం మనిషి భోజనాన్ని స్వీకరించినట్లుగా మానసిక సంతోషం కోసం సంతృప్తిని స్వీకరించాలి.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement