Wednesday, December 11, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

సంపూర్ణం సుఖ శాంతులను పొందడమే లక్ష్యము
పరిపూర్ణ సుఖ శాంతులను పొందడమే ప్రతి మానవుని జీవిత లక్ష్యము అని ఆలోచన ఉన్న ఏ వ్యక్తి అయినా చెబుతాడు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ తమ విధానాల అనుసారంగా శ్రమిస్తారు. మానవుని సర్వ ప్రయత్నాలూ ఈ దిశలోనే ఉంటాయి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ” సంపూర్ణ సుఖ శాంతులు ” అంటే ఏమిటి? దీని గురించి స్పష్టమైన అవగాహన అందించదలుచుకున్నాము. గతంలో, ఎవరి జీవితంలోనైనా సంపూర్ణ సుఖ శాంతులు స్థిరంగా, పరిపూర్ణంగా ఉన్నాయా? ఇలా ఉన్నవారు ఎవరు? వారు ఎప్పుడు జీవించారు? సంపూర్ణ సుఖ శాంతులను పొందడమే మన జీవిత లక్ష్యము అన్నప్పుడు అలా జీవించి ఉన్నవారి జీవితము మన ముందు ఉదాహరణగా నిలుస్తుంది. వారి జీవితము మనకు ఒక స్పష్టమైన అవగాహనను అందిస్తుంది.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement