Wednesday, April 24, 2024

బ్రహ్మాకుమారీస్‌ — ఆరోగ్యంగా ఉండే కళ (ఆడియోతో…)

జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో మూడవది ‘ఆరోగ్యంగా ఉండే కళ’
3.
ఆరోగ్యంగా ఉండే కళ :
స్వాస్థ్యం అనగా స్వ(ఆత్మ) మరియు అస్థి(స్థితి) అనగా ఆత్మిక స్థితిలో ఉంటూ ప్రతికర్మ చేస్తూ ఉండుటయే స్వాస్థ్యం లేక ఆరోగ్యం. నిరంతరం తమనుతాము నిశ్చింతానగర చక్రవర్తిగా భావించి సంతోషంగా ఉండాలి. ”సంతోషాన్ని మించిన పౌష్టికాహారం మరొకటి లేదు” -స్వచ్ఛమైన నీరు, తాజాభోజనం, తాజా గాలి మంచి ఆరోగ్యానికి మూలం. బ్రహ్మా బాబా ”ఆరోగ్యం కోసం మందులతో బాటు దేవెనలు కూడా తీసికొనండి” అంటారు. ఈ సృష్టి నాటకంలోని గుహ్యరహస్యాన్ని అర్థం చేసికొని నిరంతరం ప్రతి పరిస్థితిలో కూడా ప్రసన్నంగా ఉం డుటయే ఆరోగ్యంగా ఉండే కళ.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement