Tuesday, January 25, 2022

ధర్మం – మర్మం : భోగి (ఆడియోతో…)

భోగి మంటలోని అంతరార్థం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

గోదాదేవి నెల రోజులు వ్రతం చేసి రంగనాథుడిని వివాహమాడి ఆ స్వామి చెంతకు చేరి భోగము అనుభవించిన రోజు భోగి అంటారు. నూటికి తొంబై మంది భోగి మంటలు చలి తీవ్రతను తట్టుకోలేక వేసుకునేవి అనుకుంటారు. ఆ మంటలలో ఇంట్లోని పాత వస్తువులను ముఖ్యంగా కలపను వేయడం ఆచారం. అందులోని ఆంత ర్యాన్ని నిశితంగా పరిశీలిస్తే అగ్ని అంటే జ్ఞానమని పండితుల నిర్వచనం. కలప అంటే అజ్ఞానం. అనగా జ్ఞానంలో అజ్ఞానాన్ని తగులబెట్టడం భోగి మంట. అజ్ఞానం, ఆరాటం, ఆశ, తుచ్ఛ అనుభవం, విపరీత ప్రవృత్తి, భ్రమ ఇవి మనలో ఉన్న కలపలు. వీటన్నింటిని జ్ఞానరూపమైన భగవంతునిలో దహింప చేయడమే భోగిమంట చెప్పే సందేశం.

ప్రస్తుతం ఉన్న అజ్ఞానం తరువాత కలుగబోయే అజ్ఞానపు ఆలోచనలు అన్నీ కూడా దహింప చేయవలసినవే. ఇందులోని పరమార్థం స్వార్థాన్ని దహింప చేయడమే. ఇతరుల ఇళ్ళల్లోని కలపను కూడా భోగి మంటల్లో వేసే ఆచారం ఉంది. అనగా వారికి ఇష్టం ఉన్నా లేకున్నా వారి అజ్ఞానాన్ని కూడా పోగొట్టే ప్రయత్నం చేయాలి, అపుడు స్వార్థానికి తావుండదు.

భోగి పండుగ రోజు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు రేగి పళ్లు, చెరుకు గడలు, కొత్త పంటగా వచ్చిన బియ్యం, నాణలు, బెల్లం ఇవ్వన్నీ కలిపి భోగి పళ్లుగా వారి శిరస్సున పోసే ఆచారం ఉంది. మన సంపదను పది మందికి పంచిపెట్టే దాత్రుత్వ బుద్ధి పిల్లలకు అలవర్చాలని, ఉన్నది, తిన్నది మనది కాదని పది మందికి పంచినదే మనదనే ఉపనిషత్తు వాఖ్యసారం ఈ ఆచారంలో ఇమిడి ఉంది.

శ్రీమాన్‌ డాక్ట ర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News