Friday, April 19, 2024

భాస్కరశతకం-1

తెలుగులో వెలువడిన మొట్టమొదటి దృష్టాంతక శతకం భాస్కర శత కం. తెలుగు నాట విశేష ప్రాచుర్యం పొందిన ఈ శతకాన్ని మారన అనే కవి (మార్కండేయ పురాణకర్త కాదు) రచించాడు. ఈ శతకము లోని ప్రతి పద్యంలోనూ పూర్వభాగంలో ఒక ప్రతిపాదన చేసి, ఉత్తర భాగం లో దృష్టాంతాలతో అర్థాంతర న్యాసాన్ని సృష్టించాడు. ఇది ఈ శతకము లోని ప్రత్యేకత. అప్పకవి ఈ శతకంలో ఒక పద్యాన్ని ఉదాహ రించాడు కాబట్టి ఇతడు క్రీ.శ. 1660కి ముందువాడని చెప్పవచ్చు. పద్యాలు అకా రాది క్రమంలో వ్రాశాడు. ఈ పద్యాలకు డా|| రేవూరు అనంత పద్మనాభ రావుగారు అందించిన తెలుగు వ్యాఖ్యానం…

పద్యం: శ్రీగల భాగ్యశాలికడ చేరగ వత్తురు తారు దారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియు నైన నిల్వ, ఉ
ద్యోగముచేసి రత్న నిలయుండని కాదె సమస్త వాహినుల్‌
సాగరు చేరుటెల్ల మునిసన్నుత! మద్గురుమూర్తి భాస్కరా!

భావం: ఓ గురుదేవా! మునులచే పొగడబడెడివాడా! భాస్కరా! సంప దలు గల భాగ్యశాలి వద్దకు తమంతట తామే దూరాభారం శ్రమకు, వ్యయప్రయాసలకు ఓర్చి జనులు వచ్చి నిలుస్తారు. అదెట్లనగా రత్నాక రుడైన సముద్రుని వద్దకు అన్ని నదులు దూర తీరాల నుండి వచ్చి సంగమించినట్లు గదా!
”నదీనాం సాగరోగతి:” అని నానుడి. సము ద్రునిలో రత్న సంపద వుందని నదులన్నీ అక్కడికి చేరుకొం టాయని కవి చమత్కరిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement