Monday, December 4, 2023

భక్తుని కర్తవ్య విధులు

భగవంతుని శరణు కోరిన వారు తమ జీవితంలో జరిగే మంచిచెడులన్నీ భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగు తున్నాయ ని భావించాలి. తమకు కలిగిన సంతోషాన్ని ఎవరితో అయినా పంచుకోవచ్చుకానీ కష్టాలను, బాధలను ఎవరికీ చెప్పుకోకూడదు. బాధపడకూడదు. ఎవరికైనా చెప్పుకుంటే మనోభారం తగ్గుతుందని భావించి ఇతరుల వద్ద వెల్లడి స్తారు. అలా చేస్తే కష్టాలకు లొంగి పోవడమే అవుతుందని అంటారు మన భాష్యకారులు. మానవ జీవితంలో ఎదుర య్యే ఒడిదుడుకులకు తలొగ్గకుండా తమ జీవన కర్తవ్యాన్ని నెరవేర్చాలని చెబుతాయి మన ఇతిహాసాలు. నిజమైన భక్తులు ఎలా వుండాలి, తమ విధులను ఎలా నిర్వర్తించాలో తెలుసుకుందాం.
చేసే ప్రతి పనిని భగవంతుని సేవగా భావించి చేయాలి.
భగవంతుని సేవలో నిమగ్నమైన గొప్ప భక్తులను కూడా చిత్త శుద్ధితో సేవించాలి. వారి నుంచి భాష్యాలను అధ్యయనం చేయాలి. వాటిని మానవాళి ప్రయోజనం కోసం ప్రతిచోటా ప్రచారం చేయాలి.
దైనందిన కార్యక్రమాల్లో ఎంత బిజీగా వున్నా 24 గంటల సమయంలో కొంత సమయం ఆలయాల పరిశుభ్రత, నిర్వహణకు కేటాయించాలి. స్వామివారి పుష్పాలు, అలంకరణలు నైవేద్యాలు… ఇలా మీకు చేతనైన సేవ చేసుకోండి.
భక్తులు కానివారి ఇళ్లలో సమర్పించే ప్రసాదమైనా, తీర్థమైనా స్వీకరించకూడదు.
విష్ణు దేవాలయంలో భగవంతుని సన్నిధిలో ఉంటే భక్తులు కానివారు చుట్టూ ఉన్నా తీర్థం, ప్రసాదం తీసుకోవచ్చు.
పవిత్ర స్థలంలో తీర్థం, ప్రసాదాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదు.
ఉపవాసం ఉన్నప్పటికీ దేవాలయాలలో తీర్థం, ప్రసాదాలను తిరస్కరించకూడదు.
భక్తులు కాని వారి ఇళ్ళల్లోని పటా లను పూజించకూడదు.
భక్తుడు అవమానించినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురు తిరిగే ప్రయత్నం చేయకూడదు.
శాశ్వతమైన ఆనందాన్ని పొం దాలనే తపన ఉన్నవారు భక్తులందరి క్షేమం కోసం ప్రయత్నించాలి.
భగవంతునికి శరణాగతి చేసిన తర్వాత కొన్ని సుఖాలు పొందినప్ప టికీ, దైవసంకల్పానికి వ్యతిరేకంగా ప్రవర్తిం చకూడదు.
తినే ఆహారమంతా ముందుగా భగవంతునికే సమర్పించాలి. పువ్వు లు, పండ్లు, సువాసనలు, ఇలాంటి వాటిని మొదట భగవంతుడికి అంకితం చేయకుండా తీసుకోకూడదు.
భగవంతునికి సమర్పించే నైవేద్యాన్ని ఒకరి వ్యక్తిగత అభిరుచిని బట్టి ఎంపిక చేసుకోకూడదు.
భగవంతునికి సమర్పించే నైవేద్యం తాజాగా ఉండాలి. ఆరోజు తయారుచేసిన పదార్థాలనే నైవేద్యంగా సమర్పించాలి. రాత్రి చేసిన వంటకాలను మరుసటిరోజు ఉదయం నైవేద్యంగా పెట్టకూడదు.
దేవునికి సమర్పించిన సమస్త నైవేద్యాలను అందరికి పంచిపెట్టాలి. అంతా ఒక్కరే తినకూడదు.
భక్తులు ఇతరులు చూసిన లేదా రుచి చూసిన ఆహారాన్ని తినకూడదు.
భక్తి లేనివారు దానం చేసినా, ధనం ఇచ్చినా, విలువైన వస్తువులు అడగకుండా ఇచ్చినా తీసుకోకూడదు.
శాస్త్రాలు నిర్దేశించిన అన్ని ఆచారాలు వేడుకలు అత్యంత అంకిత భావంతో, శరణాగతి, స్ఫూర్తితో చేయాలి.
దేవాలయం లేదా భగవంతుని సన్నిధిని సూచించే ఇతర నిర్మాణాలను దాటి వెళ్ళేటప్పుడు వాటి ముందు భక్తి పూర్వకంగా నమస్కరించాలి.
³భక్తులను అవమానించడం ఆత్మ వినాశనానికి దారితీస్తుంది.
భగవాన్‌ (భగవంతుడు), భాగవతాలు (భక్తులు) ఇద్దరికీ సేవ చేయకుండా ఒక వ్యక్తి ఎప్పటికి ముక్తిని పొందలేడు.
భగవంతుని (భగవాన్‌) ఆరాధనకంటే భక్తుల (భాగవత) ఆరాధన శ్రేష్టమైనది. భక్తుని తీర్థము, ప్రసాదము భగవం తునికంటే శ్రేష్టమైనది.
భగవంతుడు, భక్తులు లేదా ఆచార్యుల సమక్షంలో మర్యాద పూర్వకంగా, గౌరవప్రదంగా కూర్చోవాలి.
జ్ఞానం, భక్తి, వైరాగ్యం కలిగిన భక్తులు వారు పుట్టిన సామాజిక వర్గం లేదా కులంతో సంబంధం లేకుండా గౌరవిం చబడాలి.
వైష్ణవులు ఆర్థికంగా నష్టపోయినా వారిని నిర్లక్ష్యం చేయవద్దు చిన్నచూపు చూడకండి.
ఇతరుల గురించి పదేపదే చెడుగా మాట్లాడేవారితో సహవాసం చేయకండి. ఇతరులను దూషించడం మానండి.
ఇంద్రియ సుఖాల విషయంలో జాగ్రత్తగా, నిగ్రహంతో ఉండాలి.
పండితుడు భగవంతుని మహిమలను వివరిస్తున్నప్పుడు తగిన గౌరవం ఇవ్వండి. ప్రసంగం మధ్యలో లేచి వెళ్ళిపో కూడదు.
రోజులో కొంత భాగాన్ని తన స్వంత గురువు కీర్తిని స్తుతించడానికి, ధ్యానించడానికి కేటాయించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement