Saturday, April 13, 2024

గత జన్మ బంధం.. ఋణానుబంధమే!

ఒక యోగి, ఓ రోజు మండుటెండలో వెడుతూ ఎండకి ఓర్చుకోలేక, ఒక చెప్పులు కుట్టేవాడు దారిలో పెట్టిన చెప్పులపై కొంతసేపు నిలబడ తాడు. ఆ మాత్రం నిలబడినందుకే ఆ ఋణం తీర్చు కోవడానికి మరుజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు అనే దంపతులకు కొడుకుగా పుట్టాడు. జాతకం చూసిన పెద్దలు ఆ తల్లిదండ్రులకు హెచ్చరిక చేస్తారు. ఈ బాలుడు మీకు చాలాచాలా తక్కువ రుణపడి ఉన్నాడు. ‘వాడి చేతి నుంచి పైసా కూడా తీసు కోకండి. అతడికి మీరే అన్నీ ఇస్తూండండి’ అని చెప్తారు. నాటి నుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించ కుండా పెంచుతారు. పూర్వజన్మ గుర్తున్నందున ఆ పిల్ల వాడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒకరోజు రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా తాను రాజనగరానికి కాపలా కాయవలసి వచ్చింది. అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు నగర ప్రజలను హెచ్చరిస్తూ హితవు ఒకటి చెబుతుండేవాడు. రాజు గారు మారువేషంలో తిరుగుతూ అవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడు అనుకుంటాడు. మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు. పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తా డు. అతడు వెంటనే ఆ ధనరాశిని తల్లికి ఇవ్వ గా ఆమె పుత్రోత్సాహంలో, నియమం మర చి ఆ పళ్లెం అందుకుంటుంది.
వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు. తల్లిదండ్రులు దు:ఖిస్తే రాజు ఆ యువకుడు రాత్రి కావలి సమయంలో చెప్పిన ఈ క్రింది ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు:
మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహూదర:
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్‌ జాగ్రత జాగ్రత!
తా: తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధన ము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజ ముగా లేవు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
జన్మ దు:ఖం, జరా దు:ఖం, జాయా దు:ఖం పున: పున:
సంసార సాగరం దు:ఖం, తస్మాత్‌ జాగ్రత జాగ్రత!
తా: ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దు:ఖ భరితములు. తిరిగి మళ్ళీమళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
కామ: క్రోధశ్చ, లోభశ్చ , దేహ తిష్ఠతి తస్కరా:
జ్ఞాన రత్నాపహారాయ , తస్మాత్‌ జాగ్రత జాగ్రత!
తా: కామము, క్రోధము, లోభము మొదలైన అరిష డ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నము లను దొంగిలించుటకై మన దేహంలో దాగియున్న దొంగలు. ఓ మానవులారా, సావధానులై ఉండండి.
ఆశయా బధ్యతే జంతు:, కర్మణా బహు చింతయా
ఆయుక్షీణం న జానాతి, తస్మాత్‌ జాగ్రత జాగ్రత!
తా: ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు గడుపుతుం టారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. ఓ మానవులారాసావధానులై ఉండండి.
సంపద: స్వప్న సంకాశా: , ¸°వనం కుసుమోపమ్‌
విధుచ్ఛంచల ఆయుషం, తస్మాత్‌ జాగ్రత జాగ్రత
తా: మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు. ¸°వనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపు తీగవలె చంచలమైనది. కావున ఓ మానవులారా, సావ ధానులై ఉండండి.
క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయో:
యమస్య కరుణా నాస్తి, తస్మాత్‌ జాగ్రత జాగ్రత
తా: ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణ భంగు రములు. మన ప్రాణములను హరించుటకై వేచియు న్న యముడు ఏమాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
యావత్‌ కాలం భవేత్‌ కర్మ, తావత్‌ తిష్ఠతి జంతవ:
తస్మిన్‌ క్షీణ వినశ్యంతి , తత్ర కా పరివేదన
తా: ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో, అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మ బంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు.
ఋణానుబంధ రూపేణ, పశుపత్నిసుతాలయ:
ఋణక్షయే క్షయం యాంతి , తత్ర కా పరివేదన
తా: గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బం ధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు.
పక్వాని తరుపర్ణాని , పతంతి క్రమశో యథా
తథైవ జంతవ: కాలే, తత్ర కా పరివేదన
తా: పండిన ఆకులు చెట్టు నుండి ఏవిధముగా రాలి పోవునో అదేవిధముగా ఆయువు తీరిన వారు మరణిం తురు. దానికై దు:ఖించుట ఎందులకు?
ఏక వృక్ష సమారూఢ, నానాజాతి విహంగమా:
ప్రభతే క్రమశో యాంతి, తత్ర కా పరివేదన
తా: చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపా దనకు వెళ్ళిపోతాయి. అదేవిధంగా బంధువులతో కూ డిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని, ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ నవ సరములేదు.
ఇదం కాష్టం ఇదం కాష్టం, నధ్యం వహతి సంగత:
సంయోగాశ్చ వియోగాశ్చ, కా తత్ర పరివేదన
తా: ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేర తాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరి కొంతకాలం వియోగ దు:ఖమును అనుభవిస్తా డు. దానికి పరివేదన చెందనవసరములేదు.
ఈ చివరి శ్లోకం భార్యాభర్తల గురించి సంకే తంగా చెప్పినదే! ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వేరువేరు కుటుంబాలలో జన్మిస్తారు. వీరిద్దరు జీవితమనే నదిలో కలుస్తారు. కొంతకాలం కలి సి బతుకుతారు. కాలం సమీపించడంతో ఒకరు కైవల్యం చెందుతారు, మరొకరు ఉండిపోతారు మరికొంతకాలం. ఇది సహజం. సృష్టి క్రమం.
ఇందులో వేదన ఉండదని చెప్పలేదు. వేదన పడవద్దనీ చెప్పలేదు. సృష్టి సహజంగా వేదన తప్పదు. అందునా ఇద్దరు చాలా సంవత్సరాలు కలిసి జీవించినవారిలో ఒకరు జారిపోతే మరొ కరు వేదన పొందక ఎలా ఉండగలరు? సహజ మైన వేదనను అడ్డుకోలేం. దానిని అనుభవించ వలసినదే!
మరి పరివేదన పనికిరాదన్నారు. వేదనకి, పరివేద నకి తేడా ఉంది. వేదన సహజాతం. దానిని అనుభవిం చాలి, పరివేదన అలాకాదు, మనం తలుచుకుని తలు చుకుని వేదన చెందడాన్నే పరివేదన అంటారు. ఈ పరి వేదన పనికి రాదన్నారు.
ఇది స#హజం, సృష్టి క్రమం సుమా! ఏడిస్తే పోయిన వారు తిరిగొస్తారా? రాగలరా? సాధ్యమా? సృష్టి క్రమం ఇలాగే జరుతుంది, వేదన తప్పదు, పరివేదన పడకు అన్నారు.
మానవులలో చాలా రకాల బంధుత్వాలున్నాయి, కాని భార్యాభర్తలది ప్రత్యేక బంధం, ఇటువంటిది మరొకటి లేదు. అందుకే వీరిగురించి మాత్రమే ప్రత్యే కంగా ఉదహరించి చెప్పారు. దంపతులిద్దరూ ఒకసారి పోరు, ఎవరి సమయమొస్తే వారు జారిపోతారు, రెండవ వారు మిగిలిపోతారు, కొంతకాలం, ఒంటరి గా. ఇది అందరు భార్యాభర్తలకీ జరిగేదే!
ఇది సహజ పరిణామం, సృష్టి క్రమము అని చెప్పి ఓదార్చడమే లక్ష్యం.

  • దైతా నాగపద్మలత
Advertisement

తాజా వార్తలు

Advertisement