Wednesday, April 24, 2024

భాగవత గాథల పరమార్థం

ఇంతటి విశాల విశ్వం వెలువడినా ఆదిశక్తి పరిపూ ర్ణమైనదే, సమగ్రమైనదే. ఆఆదిశక్తిలోనే అనంత మైన విజ్ఞానము ఇమిడియున్నది. అందులో లేనిది మరెక్కడా లేదు. అది సంపూర్ణము, సమగ్రము. దానినే సర్వశక్తియుతము, సర్వవ్యాపితము, సర్వజ్జతను కలిగిన భగవంతుడని/ భగవతియని చెప్పుకుంటాము. ఆ అఖండ తేజోమయమూర్తి తనను తాను రెండుగా విభజించుకున్నది. అదే స్త్రీ పురుష శక్తులుగా, భార్యాభర్త లుగా వ్యవహరింపబడుతున్నది. ఆ రెండింటినే మనం ప్రకృతి పురుషులుగా చెప్పుకుంటున్నాము. అదే అనేక మూ అయింది. ఆ అనేకమే సకల చరాచర ప్రాణికోటిగా వ్యవహరింపబడుతున్నది. అంటే అన్ని జీవరాసులలో ఉన్నది ఆ అనంత శక్తియే. పరస్పరాధారితమైన పదార్ధం శక్తి అనంత చైతన్యవికాసాలే. ఆతత్త్వాన్ని తెలిపేదే విజ్ఞాన ము. ఆ విజ్ఞానాన్నే వేదముగా పరిగణిస్తున్నాము. ‘విద్‌’ అనే ధాతువునుండి వెలుగు చూచిన వేదము అనగా తెలు సుకొనుట. దేనిని తెలుసుకొనుట? అంటే దేనిని తెలుసు కొనడం ద్వారా మరేదానిని తెలుసుకునే అవసరం ఉండ దో దానిని తెలియచేసేదే వేదము. దానినే తెలుసుకోవాలి. దానికి ప్రాతిపదిక లేదా అర్హత తెలుసుకోవాలనే అపరిమి తమైన కోరిక లేదా జిజ్ఞాస. ఆ వేద ప్రతిపాదిత జ్ఞానమే సమస్తమైన ‘తెలివి’కి మూలమైన ఆ అనంతమూర్తిని తెలు సుకునేందుకు మార్గం చూపుతుంది. తదుపరి కాలంలో ఆ జ్ఞానమే బ్ర#హ్మసూత్రాలు,ఉపనిషత్తులుగా అవతరించింది.
భగవంతుని అనంతత్వమే ”ప్రజ్ఞ-శక్తులు”గా గుర్తింప బడుతుంది. సృష్టికి అవసరమైనది శక్తి. అది భౌతికమైనది. ప్రజ్ఞను అంతర్యామిగా చెప్పుకుంటాము. ఆ ప్రజ్ఞనే రెండు విధాలుగా గుర్తిస్తాము. ఒకటి సకలచరాచర సృష్టిలో ఉన్న అంతర్యామి లేదా ప్రజ్ఞ. ఇది లోపలా వెలుపలా అంతటా వ్యాప్తమై ఉంటుంది.అందుకే దీనిని విష్ణువు అంటారు. ఈ సృష్టి పూర్తిగా లయమైన పిమ్మటకూడా ఏకంగానిలిచే ప్రజ్ఞ రెండవది. దీనినే ఈశ్వరుడు అంటారు. ఈ రెంటికి భిన్న మైన మరొక ప్రజ్ఞ ఉన్నది దానినే బ్ర#హ్మ అంటారు. ఇలా అనంతమైన అంతర్యామి యొక్క చైతన్యమే మూడు విధా లుగా విశ్వవిశ్వాంతరాళల్లో ప్రకాశిస్తుంది. ఆ అనంతత్వం లో నుండి వచ్చినవే మహత్తు, అహంకారము, పంచభూ తాల్లాంటివి. ఇవే సృజన పరిణామశీలతకు ఉపకరణాలు.
పంచభూతాత్మకమైన సృష్టికి ఆకృతి ఉంటుంది. ఆ సృష్టిలో అహంకారం కలిసి ‘నేను నాది’అనే భావనను పెంచుకుంటుంది.దానివల్ల భగవంతుడిని కూడా తనకు భిన్నంగా భావించడం వల్ల అనంతత్వాన్ని గుర్తించ లేదు. ఆస్థితిని ‘మాయ’ అంటున్నాము. భాగవతంలో చెప్ప బడిన ‘పెంజీకటి’ ఆమాయే. దానికావల వెలిగేదే ఆదిశక్తి.
ప్రతి వ్యక్తికీ తనదైన జీవనయాన కేంద్రం ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి జీవనయాన కేంద్రం నేను, నీవు, మనం, విశ్వమంతా, సమగ్రతా, దార్శనికత, దైవ త్వం, శూన్యంలాంటి కేంద్రాల గుండా వ్యాప్తమౌతుంది. నేను అనే భావనవల్ల స్వార్థం, నీవుఅనడంలో భేద భావన, మనము అనడంలో అందరిని కలుపుకుపోయే భావన, సమగ్రతలో పరిపూర్ణతా భావన, దార్శనికతలో అంతటా తనను తనలో సమస్తాన్నీ చూచే భావన, దేవస్థితిలో అన్నింటికీ అతీతమైన భావన, శూన్యస్థితిలో ఏ భావనకూ అం టుకోని స్థితి కలుగుతుంది. ఆ స్థితికి చేరడం అంటే నది సము ద్రంలో కలసిపోయిన విధంగా భగవంతునిలో పూర్తిగా లయం కావడమే. పుట్టిన ప్రతి వ్యక్తీ ప్రతీకాత్మకంగా గాథలుగా చెప్పబడిన అనంతత్వ రహస్యాలను అవగాహన చేసుకొని జ్ఞానమార్గంలో ముక్తి ని పొందడం లక్ష్యంగా సాధనను చేయాలి అంటున్నాయి భాగవతం లోని కథలు. తత్త్వ దృష్టితో సృష్టి ర#హస్యాన్ని అర్థం చేసు కొని, కర్మ జ్ఞాన భక్తి మార్గాలను సమ న్వయం చేసుకుంటూ చేసే సాధన పరమ లక్ష్యానికి చేరుస్తుందనేది భాగవతం చెప్పే పరమార్థం. దాన్నే కథల ద్వారా సాధకులకు మార్గదర్శన చేసేందుకు ప్రయత్నించింది భాగవతం.

– పాలకుర్తి రామమూర్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement