Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 40
40
అధర్మాబిభవాత్‌ కృష్ణ
ప్రద్యుషన్తి కులస్త్రియ: |
స్త్రీషు దుష్టాసు వార్‌ష్ణేయ
జాయతే వర్ణసంకర: ||

తాత్పర్యము : ఓ కృష్ణా ! వంశమునందు అధర్మము ప్రబలమగుట వలన కుల స్త్రీలు చెడిపోవుదురు. ఓ వృష్ణివంశసంజాతుడా! అట్టి కుల స్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధినొందును.

భాష్యము : మానవ సహజ శాంతి సామరస్యాలు, ఆధ్యాత్మిక పురోగతి మంచి సంతానముపై ఆధారపడి ఉంటాయి. వర్ణాశ్రమ ధర్మాలనేవి మంచి సంతానము కొనసాగేటట్లు, సమాజ శ్రేయస్సు కాపాడబడేటట్లు రూపొందించబడినవి. ఈ ధర్మాలు స్త్రీల పాతివ్రత్యము మీద ఆధారపడి ఉంటాయి. పిల్లలు ఎలా సులభంగా మోసగించబడతారో, అలాగే స్త్రీలు సులువుగా తప్పుదోవ పట్టించబడతారు. కాబట్టి, స్త్రీలు, పిల్లలు కుటుంబ పెద్దలచే రక్షింపబడవలెను. వర్ణాశ్రమ ధర్మాలను పాటించినట్లయితే, అనేక సంక్షేమ కార్యాలలో పాల్గొని వారు తప్పుదోవ పట్టే అవకాశము ఉండదు. అలా వర్ణాశ్రమ ధర్మాలను పాటించనిచో, స్త్రీ పురుషులు విచ్చలవిడిగా కలిసే అవకాశము ఏర్పడి అనవసరపు పిల్లలు పుట్టి, మానవ సమాజము అథోగతి పట్టే అవకాశము ఉంటుంది. దుర్మార్గాలు, మోసాలు చివరికి యుద్ధాలు సర్వ సామాన్యమైపోతాయి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement