Thursday, March 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 04
04
అర్జున ఉవాచ
కథం భీష్మమహం సంఖ్యే
ద్రోణం చ మధుసూదన |
ఇషుభి: ప్రతియోత్స్యామి
పూజార్హావరిసూదన ||

తాత్పర్యము : అర్జునుడు పలికెను : ఓ శత్రుసంహార ! ఓ మధుసూధనా ! పూజార్హులైన భీష్‌మ ద్రోణుల వంటివారిని నేనెట్లుబాణములతో యుద్ధమునందు ఎదుర్కొన గలను?

భాష్యము : భీష్‌ముడు మరియు ద్రోణుడు వంటి గురువులు పూజింపదగినవారు. అటువంటి వారు మందలించినా, ఓర్చుకోవాలే గాని బదులు పలుకరాదు. సంస్కారవంతులు అట్టి వ్యక్తులతో వాక్‌ యుద్ధానికే దిగరు ఇక యుద్ధము చేసి సంహరించుట అనేది ఎట్లు సాధ్యమని అర్జునుడు శ్రీకృష్ణున్ని ప్రశ్నించుచున్నాడు. ”శ్రీ కృష్ణుడు తన తాతగారైన ఉగ్రసేనునితోగాని, గురువుగారైన సాందీపని మునితో గాని ఎప్పుడైనా ఇట్లు ప్రవర్తించెనా?” అని అర్జునుడు వాదించుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement