Friday, April 19, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 18
18
నైవ తస్య కృతేనార్థో
నాకృతేనేహ కశ్చన |
న చాస్య సర్వభూతేషు
కశ్చిదర్థవ్యపాశ్రయ: ||

అర్థము : ఆత్మ యందే తప్తుడైన మానవుడు విధి నిర్వహణ వలన పొందవలసిన పవిత్రీకరణము అంటూ ఏమీ ఉండదు. అట్లని అవి చేయకూడదూ అనీ ఏమీ లేదు. అంతేకాకా అతడు ఏ ఇతర జీవులపైనా ఆధారపడవలసిన అవసరమూ ఉండదు.

భాష్యము : ఆత్మానుభవమును పొందిన వ్యక్తి ఆత్మ యొక్క లక్షణములను ఎరిగియుండును. కనుక అతడు విధిగా నిర్వహించవలసిన ధర్మములంటూ ఏవియునూ ఉండవు. అలాగే అతడు ఏ ఇతర మానవుడికి గాని లేదా దేవతకు గాని చేయవలసినదంటూ ఏమీ మిగిలి ఉండదు. అతడు కృష్ణుని సేవను చేసిన చాలును. ఆ విధముగా అతడు 24 గంటలు నిర్విరామముగా నియుక్తుడు కావచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement