Thursday, March 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 2
02
వ్యామిశ్రేణవ వాక్యేన
బుద్ధి మోహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య
యేన శ్రేయో హమాప్నుయామ్‌ ||

తాత్పర్యము : అనేకార్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము నొందినది. కావున నాకు ఏదీ అత్యంత శ్రేయోదాయకమో దయతో నిశ్చయముగా తెలియజేయము.

భాష్యము : గడిచిన అధ్యాయములో కృష్ణుడు అనేక అంశములను ఒకేసారి వివరించటం జరిగింది. సాంఖ్యయోగము, బుద్ధియోగము, బుద్ధిచే ఇంద్రియ నిగ్రహము, ఫలాపేక్ష లేని కర్మ మరియు సాధకుని పరిస్థితి. ఇవి క్లుప్తముగా చెప్పుటచే సామాన్యమైన వ్యక్తి వాటిని అర్థము చేసుకుని పాటించుటకు మరింత వివరమణ అవసరము. కాబట్టి వారు తప్పుగా అర్థము చేసుకోకుండా ఉండేందుకై అర్జునుడు తనకు కార్యము చేయకపోవుటయా లేదా భ గవత్‌ కార్యములు చేయుటయా, ఏది కృష్ణచైతన్య మార్గమని ప్రశ్నించెను. ఆ విధముగా భగవద్గీతను పాటించాలనుకున్న అందరికీ స్పష్టతను ఇచ్చుటకు అర్జునుడు ఈ ప్రశ్నలను అడిగి ఉండెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement