Thursday, March 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 63
63
క్రోధాద్భవతి సమ్మోహ:
సమ్మోహాత్‌ స్మృతివిభ్రమ: |
స్మృతి భ్రంశాద్బుద్ధినాశో
బుద్ధినాశాత్‌ ప్రణశ్యతి ||

తాత్పర్యము : క్రోధము వలన అధికమోహము కలుగగా, మోహము వలన జ్ఞాపకశక్తి భ్రమకు గురియగును. జ్ఞాపకశక్తి భ్రమచే బుద్ధి నాశనమగును. బుద్ధి నశించినపుడు మనుజుడు తిరిగి పతనమగును.

భాష్యము : కృష్ణ చైతన్యము పెరిగే కొద్దీ ప్రతి దానినీ కృష్ణుని సేవలో వినియోగించవచ్చునని తెలుసుకోగలుగుతారు. కృష్ణచైతన్యము తెలియని వారు కృత్రిమముగా భౌతిక వస్తువులను త్యజించి ముక్తులమవుదామని భావిస్తారే గాని వారి వైరాగ్యము సంపూర్ణము కాదు. నిరాకారవాదులు భగవంతునికి ఇంద్రియములు లేవని అతడు ఆహారమును స్వీకరించలేడని భావిస్తారు. అందువలన వారు మంచి వంటకాలను దూరముగా ఉంటారు. అయితే ఆహారమును స్వీకరించలేడని భావిస్తారు. అందువలన వారు మంచి వంటకాలకు దూరముగా ఉంటారు. అయితే భక్తునికి తెలుసు భగవంతుడు నిజమైన భోక్త అని, కాబట్టి మంచి వంటకాలను అర్పించి, భగవంతుడు ప్రసాదముగా ఇచ్చిన దానిని స్వీకరించి భక్తుడు ఆధ్యాత్మిక ఎదుగుదలను పొందుతాడే కాని పతనము చెందడు. అదే నిరాకారవాదికి భగవత్ప్రేమ లేని కారణమున ముక్తుడైనట్లు భావించినా ఏపాటి ప్రలోభముకైనా పతనము కాగలడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement