Saturday, April 20, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 4.

సాంఖ్యయోగౌ పృళగ్బాలా:
ప్రవదంతి న పండితా : |
ఏకమప్యాస్థిత: సమ్యక్‌
ఉభయోర్విందతే ఫలమ్‌ ||

తాత్పర్యము : కేవలము అజ్ఞానులే కర్మ యోగమును భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమైన సాంఖ్యమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కాని ఈ రెండు మార్గములలో ఏ ఒక్క దానిని పూర్తిగా అనుసరించినను రెండింటి ఫలములను మనుజుడు పొందగలడని పండితులు చెప్పుదురు.

భాష్యము : సాంఖ్య పద్ధతి లక్ష్యము ఈ ప్పంచము యొక్క మూలమును కనుగొనుట. యోగామనగా ఈ సృష్టికి ఆధారభూతమైన పరమాత్మ లేదా విష్ణువును సేవించుట. ఈ ప్రపంచమునకు మూలము విష్ణువేనని నిర్ధారణకు వచ్చినప్పుడు సాంఖ్య అధ్యాయనము పూర్తి అయినట్లు. కాబట్టి ఒక పద్ధతి ద్వారా మూలము విష్ణువని తెలిసికొంటారు, మరియొక పద్ధతిలో విష్ణువుని సేవిస్తారు. అనగా చెట్టు యొక్క వేరును కనుగొనుట, మరియు వేరుకు నీరు పోయుట వంటి వాటిలో భేదము లేదు కనుక ఈ రెండు పద్ధతుల గమ్యము విష్ణువే గనక వాటి మధ్య కూడా భేదము లేదు. అయితే సాంఖ్య పద్ధతి యొక్క చివరి స్థాయి వరకు వెళ్ళని వారు ఈ రెండూ వేరువేరని వాదించుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement