Thursday, April 25, 2024

బాబా కథలు దీపస్తంభాలు

స ముద్రం మధ్యలో దీపస్తంభాలు ఉంటాయి. పడవలపై వెళ్ళేవారు ఆ వెలుతురువల్ల రాళ్ళు రప్పలవల్ల కలుగు ప్రమాదాల నుంచి తప్పిం చుకొని సురక్షితముగా వెళతారు. ప్రపంచమనే మహాసము ద్రములో బాబా కథలనే దీపాలు దారిచూపుతాయి. అవి అమృతముకంటె తియ్యగా వుండి ప్రపంచ యాత్ర చేసే మార్గాన్ని సులభముగను, సుగమముగను చేస్తాయి. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయంలో ప్రవే శించినప్పుడు శరీర స్పృహ, అహంకారం, ద్వంద్వభావములును నిష్క్ర మించును. అవి మన హృదయమందు నిల్వచేస్తే సందేహాలు పటాపంచలయి పోతాయి. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వచేయ బడుతుంది. శ్రీసాయిబాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడినగాని, వినినగాని భక్తుని పాపములు పటాపంచలయిపోతాయి. కాబట్టి ఇవే మోక్షమునకు సులభ సాధ నాలు. కృతయుగంలో శమదమములు (అనగా నిశ్చల మనస్సు, శరీరము) త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను, నామాలను పాడటం మోక్ష మార్గాలు. నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనను అవలంబించవచ్చు. మిగిలిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని, మహిమలను పాడుట యతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్కథలను వినుటవలన పాడుటవలన మనకు శరీరంపై నున్న అభిమానం పోతుంది. అది భక్తులను నిర్మోహులుగా చేసి, తుదకు ఆత్మసాక్షాత్కారము పొందునట్లు చేస్తుంది. అలాగే సాయిబాబా కథలు, ఆయన ఉపదేశాలు, పలుకులు చదివిన, మననం చేసుకున్న ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది.
సాయిబాబా ఎప్పుడూ తన దగ్గరకు వచ్చిన భక్తులతో ఇలా అనేవారు. ”మీరెక్కడ నున్నప్పటికీ, ఏమి చేసినప్పటికీ నాకు తెలియును. నేను అందరి హృదయాలను పాలించువాడను. అందరి హృదయాలలో నివసిస్తాను. ప్రపంచమందుగల చరాచర జీవకోటినంతటిని ఆవరించి వుంటాను. ఈ జగత్తు ను నడిపించేవాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామ రస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టిస్థితిలయకారకుడు నేనే. ఎవరైతే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారిని మాయ నుండి తప్పిస్తాను. పురు గులు, చీమలు, దృశ్యమాన చరాచర జీవకోటి అంతా నా శరీరమే, నా రూపమే.” ఎంత చక్కని యమూల్యమైన మాటలు ఇవి. ఇలాంటి ఎన్నెన్నో ఉపదేశాలను చేసేవారు సాయి. ప్రతి ఒక్కరు బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, శరీరంపై అభి మానం విడిచి తమ దృష్టిని అంతా సాయిబాబా కథలపై పెట్టాలి. ఏకాగ్ర చిత్తంతో వుంటే ఎటువంటి అలసట వుండదు. అజ్ఞానము నశిస్తుంది. మోక్షాన్ని సంపా దించడానికి మార్గం తెలుస్తుంది. భక్తితో శ్రీసాయి ఉపదేశాలు, కథలు విన్న, చది విన అందరి హృదయాల్లో బాబా స్థిరంగా వుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement