Wednesday, March 27, 2024

ఆత్మతత్త్వమే ఆదర్శం!

భగవంతుడు సర్వవ్యాప్తి అయినా ఎవరైతే పవిత్ర జీవన వ్యక్తిత్వ శీలవంతులో వారి నుండి మాత్రమే మిగిలిన వారికి వ్యక్తమవుతాడు. అటువంటి పరిపూర్ణులు శ్రీ రామ కృష్ణ పరమహంస, స్వామీ వివేకానందులు. అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత మహాసభలో హిందూమత ప్రతినిధిగా భారతీయ విజ్ఞాన సనాతన ధర్మ మహాతత్త్వాన్ని పాశ్చాత్యులకు అం దించి తన్మయులను చేసిన మహా ప్రబోధకుడు స్వామి వివేకానంద.
శ్రీ రామకృష్ణుల అస్థులను ఒక శాశ్వత స్థలంలో ఉంచి మఠ నిర్మా ణం చేయాలనే ఆకాంక్ష ఇద్దరు ఆంగ్లేయుల వల్ల జరగడం సనాతన ధర్మ సత్యముకాక మరియొకటి కాదు. కుమారి ముల్లర్‌, బుల్‌సతి అను ఆంగ్ల, అమెరికన్‌ భక్తులు గంగా నదీతీరంలోని బేలూరులో ఏడెకరాల స్థలాన్ని కొనుగోలు చేసి మఠాన్ని నెలకొల్పి దాని నిర్వహణకు లక్షరూపా యలు నిధిని సమకూర్చారు. అలాగే ఆంగ్లేయ శిష్యులైన సెవియర్‌ దంపతులు ఏడువేల అడుగుల ఎత్తులో మాయావతి అను సుందర ప్రదేశంలో స్వామీజీ నిర్దేశించినట్లు అద్వైతాశ్రమాన్ని నెలకొల్పారు.
ఆరువేలమంది సభ్యులతో నిండియున్న సర్వమత మహాసభలో స్వామీజీ నోటి నుండి వెలువడిన ”అమెరికా సోదర సోదరీ మణులా రా!” అను ముచ్చటైన మూడు మాటలు సభను ప్రేమానురాగాల ప్రకం పనలతో సంచలనాల్ని కలిగించాయి. దురదృష్టం, ఆ పవిత్రమైన మూ డు మాటలే నేటి నాయకులందరి నోట సామాన్యమైపోయాయి.
సభ్యులు ముందుగానే బయటకు వెళ్ళిపోతున్నారని స్వామీజీ ప్రసంగాన్ని చివరగా పొందుపరచేవారు సభాధ్యక్షులు. ఆయన మధు ర మహిమా వాక్కులు వినడానికి అందరూ చివరి వరకూ ఉండేవారు.
పాశ్చాత్యుల విజ్ఞానరంగ ప్రగతిని కొనియాడినా ఆ ప్రగతి స్వామీ జీని సమ్మోహనపరచలేదు.
భౌతిక వస్తువుల ప్రభావంతో అంధులై జీవితాన్ని అన్న పాన భోగాలకు పూర్తిగా అంకితం చేసి భోగభాగ్యాలనే పురుషార్థాలుగా భావించి ఇంద్రియ సుఖాలనే పరమావధిగా తలచి, ధనాన్నే దైవంగా నమ్మిన జనానికి భారతదేశంలో కనిపించేది దారిద్య్రం, మాలిన్యం, అజ్ఞానం, మౌఢ్యంకాక మరియొకటి ఉండదు. వేష భాషల ఆడంబరం విజ్ఞానమని భావించేవారికి భారతదేశం అలాగే కనపడుతుంది.
భారతీయులు తమ దేశ పొలిమేరలు దాటి జైత్రయాత్రలు, దండ యాత్రలు చేయలేదు. ఇతర దేశాల ఐశ్వర్యంపై వారి దృష్టిపడలేదు. నిరంతరం శ్రమించి సంపదలను పెంపొందించిన ఫలి తంగా రత్నగర్భ భారతదేశంపై అధర్మంగా ఎందరో విదేశీయులు దండయాత్రలు చేసి ఆర్థికంగా, సాంస్కృతిక వినాశనం చేసారు. తమ సంపద లను, శ్రమను దోచుకుని వారిని అనాగరికులని నిందించినా ఆగ్రహించలేదు.
తమపై ఎన్ని దాడులు జరిగినా, జాతి మానప్రాణాలు హరిస్తున్నా తమ ఆత్మసాక్షా త్కార సత్యాలను తెలియజేయాలని, మానవ ప్రకృతి రహస్యాలను తేటతెల్లపరచాలనీ, మానవు డి దివ్యత్వాన్ని కప్పి ఉన్న పొరల నుండి వెలికి తీసి మానవ జాతి కళ్యాణానికి దోహదపడాలని మక్కువపడ్డారు. మీరు సింహనాదాలు చేస్తూ ఫిరంగుల ముందు గెంతుతూ ఎలాంటి ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారో, భగవదన్వేషణలో భారతీయులు అలాంటి ధైర్య, శౌర్యాలను చూపుతారు. ఈ ప్రపంచం కల్పనామయమని, స్వప్నతుల్యమని నిరూపించడానికి వారు సర్వసంగ పరిత్యాగం చేయ డంలో కూడా వీరత్వమే కనిపిస్తుంది.
వారు మృత్యువును సోదరుడిలా ఆలింగనం చేసుకోవడానికి కార ణం మరణం లేదని విశ్వసించడమే. ఆత్మ యొక్క అమృత తత్త్వాన్ని అవగాహన చేసుకోవడమే. వందల ఏళ్ళ నుండి విదేశీయులు దాడి చేస్తూ, అణచివేస్తూ, సహనాన్ని పరీక్షిస్తున్నా కూడా భారతీయులు అప్రతిహతులై, అపరాజితులై మనగలుతున్నది ఒక్క ఆత్మశక్తి కార ణంగానే. భారతదేశం ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటుంది. అత్యంత దుర్భర పరిస్థితుల్లో కూడా సిద్ధపురుషులు ఉదయిస్తూనే ఉంటారు. ఆసియా ఖండం మంత్రద్రష్టలైన ఋషి పుంగవులకు జన్మభూమి. ఎన్నో భయంకర సంఘటనలు జరిగినా భారత జాతీయ ఆదర్శాలను మార్చలేక నిర్వీర్యమైపోయాయి. భారతదేశాన్ని ఎవ రూ విధ్వంసం చేయలేరు. అది వినాశం లేనిది. ఆత్మ తత్త్వాన్ని ఆదర్శంగా చేసుకుని ఆధ్యాత్మిక అన్వేషణానురాగాన్ని భారతీయులు విడిచి పెట్టనంత కాలం వారు అమరులు. చిర కాలం పేదలై దరిద్రాన్ని అనుభవిస్తున్నా తాము ఒక ఋషి సంతతి వారమని మరు వరు. వారు భగవంతుణ్ణి విడిచిపెట్టరు.
మధ్య యుగంలో ఒక పేరు పొందిన బందిపోటు వంశస్థులమని పాశ్చాత్యులు గర్వం గా చెప్పుకొన్నట్లు భారతదేశంలో సింహాసనా సీనుడైన చక్రవర్తి తాను ఒక అరణ్యవాసి, వల్కల ధారి, కందమూల భక్ష కుడుగా భగవత్‌ సాక్షాత్కారం పొందిన ఫలానా ఋషి వంశస్థుడనని చెప్పుకొని గర్విస్తాడు.
భారతీయులు కర్మయోగాన్ని, పవిత్రతను పరమ పూజ్యంగా నిలుపుకుంటారో అంతవరకు వారికి మృతి లేదు. అమెరికా, ఇంగ్లాండ్‌, శ్రీలంక మొదలైన దేశాలను పర్యటించి సనాతన హిందూ ధర్మ ఔన్న త్యాన్ని, రహస్యాలను మానవాళికి అందించిన మహనీయుడు స్వామీ వివేకానంద. మానవ శ్రేయస్సుకు సనాతన ధర్మపథమే మార్గమని అనేకమంది పాశ్చాత్యతత్త్వవేత్తలు అంగీకరించారు. ఏనాటికైనా భార తదేశమే విశ్వ గురువుగా రూపొంది మానవ కళ్యాణం చేయాలనే స్వామీజీ ఆకాంక్ష నెరవేర డానికి పాటుపడదాం.

– వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement