Thursday, April 25, 2024

అష్టాదశ పురాణ దానం

”శ్రోత భి: సకలై: కార్యం శ్రావకే పూజనం ద్విజ
ఇతిహాస పురాణానాం పుస్తకాని ప్రయచ్చతి
పూజయిత్వాయురారోగ్యం స్వర్గ మోక్ష
మవాప్ను యాత్‌.”

పౌరాణికుడిని (పురాణం చెప్పే వానిని) శ్రోత లందరూ శ్రద్ధ³గా పూజించాలి. అదే విధం గా ఇతిహాసాలను, పురాణాలను కూడా పూజించి దానం చేయాలి. ఆ విధంగా దానం చేసిన వ్యక్తి ఆయురారోగ్యాలను, స్వర్గ మోక్షాలను పొందు తాడు.
వేద హృదయమే పురాణాలు

శ్రీ మహావిష్ణువే వేదవ్యాసుడి రూపంలో అవత రిం చి వేదాలను విభజించాడు. వేదాల సారాంశం అంతటినీ, అందులో దాగున్న సృష్టి తత్త్వాన్ని వివ రించాలనే సంకల్పంతో, వేద వాఙ్మయ సారాన్ని అంతటినీ మానవాళికి అందించేందుకు అష్టాదశ పురాణాల్ని (18 పురాణాలను) అందించాడు వ్యాస మహర్షి. అష్టాదశ పురాణాలు ఉప పురాణాలు శ్రీహరి స్వరూపాలు. అష్టాదశ పురాణ శ్రవణం, పఠనం ఎంతో పుణ్యప్రదం. అలాగే అష్టాదశ పురా ణాలను దానం చేయడం ఎంతో పుణ్యప్రదం. విశిష్ట మైన మహత్తర కార్యక్రమం. శుభప్రదం.
అయితే ఏ పురాణాన్ని ఏవిధంగా దానం చేయాలి? ఏవిధంగా దానం చేస్తే ఏ రకమైన శుభాలు కలుగుతాయి? అష్టాదశ పురాణాల దాన మహత్యం ఏమిటి? ఏ పురాణాన్ని ఏ రకంగా దానం చేయాలి? విధి విధానాలు ఏమిటి? వచ్చే ఫలితాలు ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మ పురాణం: బ్రహ్మ కల్పంలో బ్రహ్మ మరీచి మహామునికి చెప్పబడింది బ్రహ్మ పురాణం. బ్రహ్మ పురాణాన్ని శ్రద్ధతో వ్రాసి జల ధేనువుతో కలి పి, వైశాఖ పూర్ణిమ రోజున యోగ్యత ఉన్న విప్రునికి దానం చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పద్మ పురాణం: పద్మ పురాణాన్ని స్వయం భువు మనువు బ్రహ్మదేవునికి పద్మ కల్పంలో బో ధించాడు. పద్మ పురాణాన్ని శ్రద్ధ³గా వ్రాసి ధేనువుతో సహా జ్యేష్ట మాసంలో దానం చేయడం శుభప్రదం.
విష్ణు పురాణము: వరాహ కల్పంలో విష్ణు పురాణాన్ని పరాశరుడు బ్రహ్మకు బోధించాడు. ఆషాఢమాసంలో ఈ పురాణాన్ని శ్రద్ధాభక్తులతో వ్రా సి, ధేనువు తో సహా యోగ్యుడైన విప్రునికి దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
వాయు పురాణం: వాయు పురాణం శ్రీ#హరి కి ఎంతో ప్రియమైనది. దీనినే శివపురాణం అని కూడా అంటారు. ఈ పురాణాన్ని శ్వేతకల్పంలో శివు డు వాయువుకు బోధించాడు. ఈ పురాణాన్ని శ్రద్ధ గా వ్రాసి శ్రావణ మాసంలో బెల్లం ధేనువుతో యో గ్యుడైన విప్రునికి దానం చేయడం ఎంతో పుణ్యప్ర దం. శుభప్రదం.
భాగవత పురాణం: గాయత్రీదేవిని ఆధా రం చేసుకుని భాగవత ధర్మాలను భాగవత పురా ణం బోధించింది. భాగవత పురాణాన్ని సారస్వత కల్పంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మకు బోధించాడు. భాగవత పురాణాన్ని శ్రద్ధ³గా వ్రాసి బంగారు సింహా సనం తో సహా భాద్రపద మాసంలో యోగ్యుడైన విప్రునికి దానం చేసిన్లటతే శుభప్రదం.
నారద పురాణం: బృహత్‌ కల్పంలో నార ద పురాణ పూర్వ భాగాన్ని సనకాదులు నారదునికి బోధించారు. ఉత్తర భాగాన్ని వశిష్టుడు మాంధాత కు బోధించాడు. ఈ పురాణాన్ని శ్రద్ధగా వ్రాసి ధేను సహతంగా ఆశ్వయుజ మాసంలో దానం చేసిన వ్యక్తికి పరిపూర్ణ సిద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబు తున్నాయి.
మార్కేండయ పురాణం: మార్కేండయ పురాణాన్ని శ్వేత వరా#హ కల్పంలో మార్కండేయు డు జైమినికి బోధించాడు. ఈ పురాణాన్ని శ్రద్ధగా వ్రా సి కార్తికమాసంలో దానం చేస్తే శుభదాయకం.
అగ్ని పురాణం: అగ్ని పురాణాన్ని ఈశాన క ల్పంలో అగ్నిదేవుడు వశిష్ట మహర్షికి బోధించా డు. 12 వేల శ్లోకాలతో గల అగ్ని పురాణాన్ని భకి ్తశ్రద్ధలతో వ్రాసి మార్గశీర్ష మాసంలో యోగ్యుడైన విప్రునికి దానం చేసిన వ్యక్తికి అన్ని కోరికలు తీరుతాయి.
భవిష్య పురాణం: ఇది సూర్య సంబంధమై న పురాణం. భవిష్య పురాణాన్ని అఘోర కల్పంలో బ్ర#హ్మదేవుడు మనువుకు బోధించాడు. ఈ పురాణా న్ని శ్రద్ధగా భక్తిశ్రద్ధలతో వ్రాసి పుష్య మాసంలో బెల్లం ధేనువుతో సహా దానం చేయడం సకల శుభదా యకం.
వైవర్త పురాణం : రథాంతర కల్పంలో సావ ర్ణి నారదునికి వైవర్త పురాణాన్ని బోధించేడు. ఈ పు రాణాన్ని శ్రద్ధా భక్తులతో వ్రాసి మాఘ మాసంలో దా నం చేయాలి. అలా చేయడం శుభప్రదం. శుభకరం.
లింగ పురాణం: లింగ పురాణాన్ని కల్పాంత కల్పంలో పరమ శివుడు నారదునికి బోధించాడు. ఈ దివ్య పురాణాన్ని శ్రద్ధగా వ్రాసి నువ్వులు ధేనువు తో సహా ఫాల్గుణ మాసంలో దానం చేసిన వ్యక్తి శివ లోకాన్ని చేరుకుంటాడు.
వరాహ పురాణం: వరాహ పురాణాన్ని మను కల్పంలో విష్ణువు పృథ్వికి బోధించాడు. పరమ పవి త్రమైన ఈ పురాణాన్ని శ్రద్ధగా వ్రాసి మాఘ మాసం లో దానం చేసిన వ్యక్తికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
స్కాంధ పురాణం: తత్పురుష కల్పంలో స్కంధుడు భూమికి బోధించిన పురాణం స్కాంద పురాణం. ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వ్రాసి చైత్ర మాసంలో దానం చేయటం ఉత్తమోత్తమం.
వామన పురాణం: కూర్మ కల్పంలో బ్రహ్మ పులస్త్య మహామునికి బోధించిన పురాణం వామన పురాణం. ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వ్రాసి పౌర్ణ మినాడు గానీ విషువ సంక్రాంతి సమయంలో దా నం చేస్తే శుభాతి శుభాలు ప్రాప్తిస్తాయి.
కూర్మ పురాణం: లక్ష్మీ కల్పంలో శ్రీ మహా విష్ణువు పులస్త్య మహామునికి బో ధించాడు. 8000 శ్లోకాలతో కూడిన ఈ పురాణాన్ని శ్రద్ధ³గా వ్రాసి సువ ర్ణంతో సహా యోగ్యుడైన విప్రునికి దానం చేయాలి. ఇలా చేయడం శుభాలను అందిస్తుంది.
మత్స్య పురాణం: సప్త కల్పంలో శ్రీ మహావి ష్ణువు మనువుకు బోధించిన పురాణం మత్స్య పురా ణం. ఈ పురాణాన్ని బంగారంతో చేసిన మత్స్యంతో పాటు యోగ్యుడైన బ్రాహ్మణునికి దానం చేయడం పుణ్యప్రదం.
గరుడ పురాణం: గరుడ పురాణాన్ని గరుడ పురాణాన్ని గరుడ కల్పంలో శ్రీ మహా విష్ణువు మను వుకు బోధించాడు. ఈ పురాణంలో విశ్వాండం నుం చి గరుత్మంతుడి పుట్టుకకు సంబంధించిన కథ అం తా చెప్పబడింది. ఇంతటి మహ త్తరమైన దివ్యమైన గరుడ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వ్రాసి బంగారు హంస ప్రతిమతో సహా దానం చేయాలి.
బ్రహ్మాండ పురాణం: ఈ పురాణాన్ని భవిష్య కల్పంలో మనువుకు బ్రహ్మ బ్రహ్మాండ పురాణాన్ని బోధించాడు. ఇందులో ఉన్న 12,000 శ్లోకాలతో కూడిన ఈ పురాణాన్ని శ్రద్ధగా వ్రాసి యోగ్యుడైన విప్రునికి దానమిచ్చిన వ్యక్తికి ఎన్నో పుణ్య ప్రదమైన సకల శుభాలు ప్రాప్తిస్తాయి.
మొత్తంగా అష్టాదశ పురాణ శ్రవణం, పఠనం, శాస్రోక్తంగా నిర్దేశిత పద్ధతిలో దానం చేయడం సకల శుభదాయకం. ఇ#హపర సుఖాలకు శ్రేయోదా యకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement